ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం | Bill English confirmed as new New Zealand Prime Minister, Paolo Gentiloni for Italy | Sakshi
Sakshi News home page

ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం

Published Mon, Dec 12 2016 11:23 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ఇద్దరు కొత్త ప్రధానుల నియామకం

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా బిల్‌ ఇంగ్లీష్‌ నియమితులయ్యారు. ఆ దేశ అధికార నేషనల్‌ పార్టీ ప్రధాని పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. ఇక ఇటలీ ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పాలో గెంటిలోనిని నియమించారు. ఆ దేశాధ్యక్షుడు సెర్గియో మాటరెల్లా అ​న్ని పార్టీల నాయకులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత సోమవారం న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ, ఇటలీ ప్రధాని మట్టెయో రెంజీ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో  వీరిద్దరి స్థానాల్లో కొత్త నేతలను ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీ స్వచ‍్ఛందంగా రాజీనామా చేయగా.. ఇటలీ ప్రధాని రెంజీ మాత్రం రెఫరెండంలో వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైదొలిగారు. ఇటలీలో రాజ్యాంగ సవరణ కోసం నిర్వహించిన రెఫరెండంలో (ప్రజాభిప్రాయ సేకరణ) ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement