రాజస్థాన్లో బీజేపీ సంబరాలు | BJP celebrates in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్థాన్లో బీజేపీ సంబరాలు

Published Sun, Dec 8 2013 10:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

రాజస్థాన్ లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు బీటలు వారనున్నాయని వార్తలు వస్తుండడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పయనిస్తోంది. బీజేపీకి అధిక స్థానాలు దక్కనున్నాయని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు బీటలు వారనున్నాయని వార్తలు వస్తుండడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణా సంచా కాల్చారు.

జైపూర్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట నృత్యాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోనూ కాషాయ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్లో 199 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఝూలావర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరా రాజే గెలుపుదిశగా పయనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement