సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణు కుమార్ రాజు ఖండించారు.
ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణు కుమార్ రాజు ఖండించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడ సమంజసం కాదని ఆయన తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించి పోరాడాలని ఆయన సూచించారు.