'పొత్తు ముందే తెగతెంపులైతే.. మెజారిటీ సాధించేవాళ్లం' | BJP might have got majority if Sena pact ended early: Rajnath singh | Sakshi
Sakshi News home page

'పొత్తు ముందే తెగతెంపులైతే.. మెజారిటీ సాధించేవాళ్లం'

Published Fri, Oct 31 2014 9:01 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

'పొత్తు ముందే తెగతెంపులైతే.. మెజారిటీ సాధించేవాళ్లం' - Sakshi

'పొత్తు ముందే తెగతెంపులైతే.. మెజారిటీ సాధించేవాళ్లం'

ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో.. బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శివసేనతో పొత్తు ముందే తెగతెంపులై ఉంటే.. మహారాష్ట్రలో స్పష్టమైన మెజారిటీ సాధించేవాళ్లం’ అన్నారు. పాతికేళ్ల అనుబంధం ఉన్న శివసేనతో విడిపోవాలని తాము కోరుకోలేదన్నారు.

 

కాగా, మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అయితే, వారి మధ్య జరిగిన చర్చల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement