
న్యూఢిల్లీ: ఆలయాలను తిరిగి తెరిచే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నేను లేఖ చదివాను. ఆలయాల్లో దర్శనాలకు అమనుతి ఇవ్వాలంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సంయమనం పాటించవచ్చని నేను నమ్ముతున్నాను' అని షా పేర్కొన్నారు. (చైనాతో బంధంపై ‘సరిహద్దు’ ప్రభావం)
కాగా.. మహారాష్ట్రలోని ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవడం గురించి కోష్యారి గత వారం ఠాక్రేకు లేఖ రాశారు. ఈ లేఖలో 'ప్రార్థనా స్థలాలను తిరిగి ప్రారంభించడాన్ని వాయిదా వేయడానికి మీకేమైనా దైవ సందేశం వచ్చిందా..?. సెక్యులర్ అన్న పదాన్ని వ్యతిరేకించే మీరు అకస్మాత్తుగా లౌకికవాదిగా మారిపోయారా' అని ఆయన తన లేఖలో ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పందిస్తూ.. 'నేను ఆచరించే హిందుత్వకు గవర్నర్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. ప్రజల ఉద్వేగాలు, నమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటూనే వారి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని, లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం సరికాదని ఉద్ధవ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (మీ పాఠాలు మాకు అనవసరం)