బరితెగించిన ఆకతాయిలు! | Brats harrass woman in malardevpally | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవాలంటూ ఆటోలో యువతిపై..!

Published Tue, Aug 1 2017 12:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

బరితెగించిన ఆకతాయిలు! - Sakshi

బరితెగించిన ఆకతాయిలు!

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఆకతాయిలు బరితెగించారు. ఆటోలో వెళ్తున్న యువతిని వెంబడించి మరి వేధించారు. సోమవారం సాయంత్రవేళ నడిరోడ్డు మీద ఈ ఘటన జరిగింది. జైరా అనే బాను అనే యువతి షాపింగ్‌ ముగించుకొని ఇంటికి వెళుతుండగా ఐదుగురు యువకులు ఆమెను దారిలో అడ్డిగించే ప్రయత్నం చేశారు.

ఏకంగా ఆమె ప్రయాణిస్తున్న ఆటోలోకి ఎక్కి.. ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. ఆమెను బయటకు లాగి దాడి చేసేందుకు యత్నించారు. ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన బాధిత యువతి మైలార్‌ దేవ్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆకతాయిల్లో ఒకతను తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అమ్మాయికి తెలిసిన ఆకతాయే ఇలా ప్రవర్తించినట్టు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని గుర్తించారు. వివిధ సెక్షన్‌ల కింద వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement