కేంద్ర మంత్రి గడ్కారీ, కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు హితవు
న్యూఢిల్లీ: ‘‘మీరు పేరొందిన రాజకీయ నేతలు. అందరూ మీవైపే చూస్తున్నారు. మీరు వైరాన్ని మరచి ఎందుకు చేతులు కలపకూడదు? ఈ అంశాన్ని సానుకూలంగా ఎందుకు పరిష్కరించుకోకూడదు?’’ అంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర మంత్రి గడ్కారీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు హితవు పలికింది. ఈ ఏడాది జనవరి 30న కేజ్రీవాల్ అత్యంత అవినీతి పరుల జాబితాలో ఒకరిగా గడ్కారీని పేర్కొనడం... వాటిపై గడ్కారీ ఢిల్లీ స్థానిక కోర్టులో పరువునష్టం దావా వేశారు. అనంతరం బెయిల్‌కు పూచీకత్తు సమర్పించనందున కేజ్రీవాల్‌ను రిమాండ్‌కు పంపించారు. దీన్ని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో చేసిన సవాలును గురువారం జస్టిస్ రేవ ఖేత్రపాల్, జస్టిస్ ఎస్.పి.త్యాగితో కూడిన బెంచ్ విచారించింది. ఇలాంటి అంశాలకు ముగింపనేది ఉండదని, ఇద్దరు నేతలు సానుకూలంగా పరిష్కరించుకుని వివాదానికి ముగింపు పలకాలని సూచించింది.
చేతులు కలపండి.. వైరాన్ని మరవండి
Published Fri, Aug 1 2014 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement