బీజింగ్: ఉత్తర చైనాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టియాంజిన్ పట్టణానికి దగ్గరలోని హైవే మీద వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్ ప్రెస్ వేకు కిందవున్న కాలువలో నుంచి శవాలను వెలికితీస్తున్నారు.
ఉత్తర హోబెయ్ ప్రావిన్సు నుంచి ఈశాన్యాన ఉన్న షెన్యాంగ్ నగరానికి 30మందితో బస్సు బయలుదేరింది. రోడ్డుకు ఓ వైపు అంచున్న నడుస్తున్న వాహనం టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీకొని కాలువలో పడినట్లు గాయాలపాలైన నలుగురు ప్రయాణీకులు తెలిపారు. కాగా, యాక్సిడెంట్లలో ప్రతి ఏటా 2,50,000 మంది చైనీయులు మరణిస్తున్నారు. సుదూర ప్రయాణాలను తక్కువ ధరలకే అందిస్తూ అక్కడి రవాణా సంస్థలు పోటీపడుతుంటాయి.
ఘోర రోడ్డు ప్రమాదం..26 మంది దుర్మరణం
Published Sat, Jul 2 2016 12:42 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement