'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'! | Can Speak to Rahul Gandhi for GST, Says Arun Jaitley, Amid 'Intolerance' Row | Sakshi
Sakshi News home page

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

Published Wed, Nov 4 2015 12:39 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

'రాహుల్‌తో మాట్లాడేందుకు సిద్ధమే'!

న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో రాజీకి సిద్ధమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయంలో రాహుల్‌తో మాట్లాడేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణ చర్యల్లో అత్యంత కీలకమైన జీఎస్టీ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో పార్లమెంటులో నిలిచిపోయింది. మరోవైపు దేశంలో మత అసహనం పెరిగిపోతున్నదని కేంద్రంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై కాంగ్రెస్‌ నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని జైట్లీ చెప్పారు. 'వారికి (కాంగ్రెస్) సంబంధించిన ఏ నాయకులతోనైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని జైట్లీ పేర్కొన్నట్టు బ్లూమ్‌బర్గ్ న్యూస్ తెలిపింది. రాహుల్‌ గాంధీతో కూడా మాట్లాడుతారా? అన్న ప్రశ్నకు తప్పకుండా అని ఆయన బదులిచ్చారు.

వస్తు సేవల పన్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఇది అమలైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న 11 లెవీ పన్నులు రద్దవుతాయి. దేశమంతా ఒకే మార్కెట్‌గా భావించి పన్ను విధించడానికి వీలు పడుతుంది. అయితే కీలకమైన ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందకపోతే గడువులోగా ఇది అమలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒప్పించే ప్రయత్నంలో కేంద్రం తలమునకలైంది. జీఎస్టీ బిల్లుపై ప్రతిపక్ష నేతలందరినీ సాధ్యమైనంత తొందరలో ఒప్పించే ప్రయత్నం చేస్తామని ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement