ఆర్థిక సమాచార మార్పిడిపై మరో ఒప్పందం | Canada Signs Multilateral Competent Authority Agreement | Sakshi
Sakshi News home page

ఆర్థిక సమాచార మార్పిడిపై మరో ఒప్పందం

Published Thu, Jun 4 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

Canada Signs Multilateral Competent Authority Agreement

ఐదు దేశాలతో జత కట్టిన భారత్
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాలను స్వేచ్ఛగా మార్పిడి చేసుకునేందుకు భారత్ సహా ఆరు దేశాలు తాజాగా ఓ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో పన్ను ఎగవేతలు, నల్లధనం పోరులో మరో ముందడుగు పడినట్లయింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, ఇండోనేసియా, న్యూజిలాండ్‌లు ఈ మల్టీలేటరల్ కాంపిటెంట్ అథారిటీ అగ్రిమెంట్(ఎంసీఏఏ)ను పారిస్‌లో కుదుర్చుకున్నాయి.

దీంతో భారత్‌తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న దేశాల సంఖ్య 60కి చేరింది. మరోవైపు విదేశాల్లో నల్లధనం కలిగి ఉన్న వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని ఐటీ శాఖకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే జరిగే పొరపాట్ల వల్ల దేశానికి నష్టం జరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. ఆ పొరపాట్లను సాకుగా చూపి.. భవిష్యత్తులో నల్లధనం వివరాలను అందించడానికి విదేశాలు నిరాకరించవచ్చని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement