వాహనం లైఫ్ ముగిసిందా? మీకు శుభవార్త!
వాహనం లైఫ్ ముగిసిందా? మీకు శుభవార్త!
Published Mon, Dec 19 2016 9:48 AM | Last Updated on Tue, Aug 14 2018 3:24 PM
న్యూఢిల్లీ: లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను వాటి తయారీదారులే కొనుగోలు చేసి రీ-సైక్లింగ్ చేసే విధంగా భారత ప్రభుత్వం త్వరలో ఓ చట్టాన్ని తీసుకురానుంది. గాలి కాలుష్యం దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఇందుకు ప్రధాన కారణమవుతున్న లక్షల కొద్దీ ఫిట్ నెస్ లేని బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులను రీ-సైక్లింగ్ చేసే బాధ్యతలను ఆయా కంపెనీలే తీసుకునేలా చేయాలని నిర్ణయించింది.
కార్ల లైఫ్ టైమ్ పూర్తయిన తర్వాత వాటిని రీ-సైక్లింగ్ కు పంపే పాలసీలు ఇప్పటివరకూ భారత్ లో లేవు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది నవంబర్ ఏర్పడిన కాలుష్య పొగలు కారణంగా పరిస్ధితులను చక్కదిద్దేందుకు వాతావరణ మంత్రిత్వ శాఖ నడుబిగించింది. లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను ఆయా కంపెనీలే రీ-సైకిల్ చేసేలా త్వరలో ఓ కొత్త రూల్ తీసుకురానుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కొత్త ఏడాదిలో ప్రకటించనున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో తయారీ కంపెనీలు రీ-సైక్లింగ్ సెంటర్లను నిర్మించుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల పాటు సమయం ఇవ్వనుంది. చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ఈ పద్దతిని అమలు చేసి కాలుష్యాన్ని కొంతమేరకు అదుపు చేయడంలో సఫలీకృతమయ్యాయి.
Advertisement