కార్ల అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే
కార్ల అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే
Published Tue, Aug 13 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
న్యూఢిల్లీ: కార్ల అమ్మకాలు ఈ ఏడాది జూలైలో 7.4 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియాం) సోమవారం తెలిపిం ది. కార్ల అమ్మకాలు తగ్గడం ఇది వరుసగా 9వ నెల అని సియాం డెరైక్టర్ జనరల్ విష్ణు మాధుర్ పేర్కొన్నారు. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడం వరుసగా 17వ నెల అని వివరిం చారు. మోటార్ సైకిళ్లు, మొత్తం వాహనాల అమ్మకాలు పడిపోవడం ఇది వరుసగా ఆరవ నెల ని చెప్పారు. అమ్మకాలు తగ్గిన ప్రభావంతో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం)తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయని పేర్కొన్నారు.
కష్టకాలంలో ఉన్న వాహన పరిశ్రమను గట్టెక్కించడానికి ప్యాకేజీ కావాలని ప్రభుత్వాన్ని గతంలోనే కోరామని వివరించారు. ప్యాకేజీలో భాగంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని, గత ఏడాది మే నుంచి ప్రభుత్వపరంగా కొత్త వాహనాల కొనుగోళ్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఆర్థిక అనిశ్చితి, గరిష్ట స్థాయిల్లో ఉన్న ఇంధనం, వడ్డీరేట్లు డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అయితే హోండా అమేజ్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కొత్త మోడళ్ల రాకతో అమ్మకాలు కొంత పుంజుకున్నాయని వివరించారు.
సియాం వివరాల ప్రకారం..,
గత ఏడాది జూలైలో 1,41,646గా ఉన్న దేశీయ కార్ల అమ్మకాలు ఈ ఏడాది జూలైలో 7 శాతం క్షీణించి 1,31,163కు తగ్గాయి.
మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 65,008 నుంచి 15 శాతం క్షీణించి 55,301కు పడిపోయాయి. భారీ, మధ్య తరహా వాణిజ్య వాహనాల అమ్మకాలు 20 శాతం తగ్గాయి.
మొత్తం వాహన అమ్మకాలు 14,45,112 నుంచి 2 శాతం క్షీణించి 14,15,102కు పడిపోయాయి.
Advertisement
Advertisement