యువతిని ఫేస్‌బుక్‌లో వేధిస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తుర్కయంజాల్: యువతిని ఫేస్‌బుక్‌లో వేధిస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం... పనామా గోదాముల సమీపంలోని అక్షయ హాస్టల్‌లో ఉండే ఓ యువతి (19)ని కె.భరణికుమార్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో యువతి తన బంధువులతో కలిసి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు భరణికుమార్‌పై 420, 506, సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.