ఆర్‌బీఐ అక్రమాలపై సీబీ‘ఐ’ | CBI enquiry on RBI Illegal cash distribution | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అక్రమాలపై సీబీ‘ఐ’

Published Sun, Dec 18 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

ఆర్‌బీఐ అక్రమాలపై సీబీ‘ఐ’

ఆర్‌బీఐ అక్రమాలపై సీబీ‘ఐ’

- నోట్ల మార్పిడిలో ఇంటి దొంగల గుట్టురట్టు
- బెంగళూరులో ఇద్దరు ఆర్‌బీఐ అధికారుల అరెస్టు
- రూ. 1.99 కోట్ల మేర కొత్త నోట్లు మార్చినట్లు గుర్తింపు
- గుజరాత్‌లో ఫైనాన్స్‌ వ్యాపారి నుంచి రూ. 250 కోట్ల నగదు, ఆభరణాలు, ఆస్తులు సీజ్‌
- ముంబైలో రూ. 69 కోట్ల అక్రమాలకు పాల్పడ్డ నలుగురు బంగారం వ్యాపారులు
- బెంగళూరు తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 5.2 కోట్ల విలువైన కొత్త నోట్లు


బెంగళూరు/న్యూఢిల్లీ/సూరత్‌/చెన్నై:

కంచె చేను మేసిన చందాన... ఆర్‌బీఐ అధికారులే నోట్ల అక్రమాల్లో సూత్రధారులుగా తేలుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆర్‌బీఐ అధికారిని అరెస్టు చేసిన ఘటన మరవక ముందే మరో ఇద్దరిని సీబీఐ అధికారులు శనివారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.99 కోట్ల మేర నోట్ల మార్పిడితో సంబంధముందని తేల్చిన సీబీఐ... ఆర్‌బీఐ నగదు విభాగంలో పనిచేస్తున్న సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ సదానంద నాయక్, స్పెషల్‌ అసిస్టెంట్‌ కె.కవిన్‌ను అరెస్టుచేసింది . వారిద్దరిని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.

నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులతో కలసి అరెసై్టన ఆర్‌బీఐ అధికారులు, ఇతర అధికారులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ప్రతినిధి దేవ్‌ప్రీత్‌ సింగ్‌ చెప్పారు. కొత్త నోట్ల బాధ్యతను అప్పగిస్తే... మోసంతో రూ. 1.99 కోట్ల కొత్త నోట్లను అక్రమ పద్ధతుల్లో మార్పడి చేశారని, ఆర్‌బీఐ నగదు మార్పిడి నిబంధనలకు ఇది విరుద్ధమని ఆమె వెల్లడించారు. నోట్ల రద్దు అనంతరం బెంగళూరులో ఆర్‌బీఐ ఉద్యోగుల్ని అరెస్టు చేయడం ఇది రెండోసారి. డిసెంబర్‌ 13న రూ. 1.51 కోట్ల పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తోన్న ఆర్‌బీఐ అధికారిని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

ఒకప్పుడు ఛాయ్‌వాలా...ప్రస్తుతం రూ. 250 కోట్లకు అధిపతి
ఐటీ అధికారులు రోజుకో అక్రమాల పుట్టను పగులకొడుతున్నారు. దీంతో నోట్ల కుంభకోణంలో ఎప్పుడు ఎవరు చిక్కుతారోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. తాజాగా ఐటీ అధికారులు గుజరాత్‌లో ఒక వడ్డీ వ్యాపారి వద్ద రూ.250 కోట్ల నగదు చూసి అవాక్కయ్యారు. 30 ఏళ్ల క్రితం టీ అమ్మిన చరిత్ర ఉన్న కిశోర్‌ భాజీవాలాది గుజరాత్‌లోని ఉడ్నా... టీ వ్యాపారాన్ని మానేసిన అనంతరం భాజీవాలా ఫైనాన్స్‌ వ్యాపారం మొదలుపెట్టి భారీగా ఆస్తులు కూడబెట్టాడు. నవంబర్‌ 8న నోట్ల రద్దు నిర్ణయం అనంతరం తన బ్యాంకు ఖాతాలో భాజీవాలా రూ. 1.5 కోట్లు డిపాజిట్‌ చేశాడు. అనుమానమున్న వారిపై ఐటీ శాఖ వరుస దాడులు నిర్వహించడంతో అతని చరిత్ర బయటపడింది.

కొద్ది రోజుల పాటు నిఘా పెట్టి వివరాలు కూపీ లాగారు. అతని ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లపై ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు చేసింది. భాజీవాలాకు, అతని కుటుంబసభ్యులకు 16 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తనిఖీల్లో ఐటీ అధికారులు గుర్తించారు. 8 లాకర్లలో రూ. 75 లక్షల విలువైన 180 కిలోల వెండి, రూ. 2.5 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, రూ. 1.08 కోట్ల కొత్త నోట్లు, రూ. 23 లక్షల మేర రద్దైన నోట్లు, రూ. 5 లక్షల విలువైన రూ. 5, రూ. 10, రూ. 20 నోట్లు, రూ. 4.50 లక్షల విలువైన కిసాన్‌ వికాస్‌ పత్రాలు, 200 ఆస్తులు, ఒప్పందాల పత్రాలు, 27 బ్యాంకు ఖాతాల వివరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తుల విలువ రూ. 250 కోట్లకు పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

రూ. 69 కోట్ల అక్రమాల్ని వెలికితీసిన ఈడీ
ముంబైలో బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా అక్రమాల్ని బయటపెట్టారు. నోట్ల రద్దు అనంతరం నలుగురు వ్యాపారులు నకిలీ కంపెనీల్ని సృష్టించి రూ. 69 కోట్ల విలువైన నగదు కార్యకలాపాల్ని నిర్వహించినట్లు గుర్తించారు. హవాలా ఒప్పందాలు, మనీ ల్యాండరింగ్‌ వ్యవహారాలపై తనిఖీల్లో భాగంగా ఈడీ శుక్రవారం ఈ దుకాణాలపై దాడులు చేసి అక్రమాల్ని బయటపెట్టింది. బంగారం వ్యాపారుల బ్యాంకు ఖాతాల్ని పరిశీలిస్తున్నామని, త్వరలో సమన్లు జారీ చేస్తామని ఈడీ అధికారులు తెలిపారు.

బెంగళూరులో రూ. 5.2 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం
బెంగళూరులో మరోసారి భారీగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సమీపంలోని సర్కిల్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రూ.5.2 కోట్ల విలువైన కొత్త 2 వేల నోట్లను కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. రద్దైన పెద్దనోట్లను మార్చుకునేందుకు ఇద్దరు వ్యక్తులు కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. మధ్యవర్తుల ద్వారా పని పూర్తిచేసుకుని రూ.5.2కోట్లను తరలిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. వారిని విచారించగా తొలుత రియల్‌ ఎస్టేట్‌కు చెందిన నగదుగా పేర్కొన్నారు. ఐటీ అధికారులు మరింత లోతుగా విచారించగా... అది ఒక నగల దుకాణానికి చెందిన నగదుగా తేలింది. పట్టుబడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన విజయ్‌ తనకు వచ్చిన రూ.22లక్షల కమిషన్‌తో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అరెస్టై ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

తమిళనాడులో రూ. 70 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి, ఈరోడ్‌ జిల్లాల్లో రూ.70లక్షల కొత్త నోట్లు పట్టుబడ్డాయి. ఈ రెండు కేసుల్లో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. తిరుచ్చిరాపల్లి కేకే.నగర్‌కు చెందిన హోటల్‌ యజమాని పీర్‌ మహ్మమద్‌ (40) మరో ముగ్గురు బంధువులతో కలిసి తిరుచ్చి నుంచి శుక్రవారం రాత్రి తంజావూరుకు ఆడి కారులో వెళుతున్నారు. ఒరత్తనాడు బైపాస్‌రోడ్డులో కారు తనిఖీ చేసిన పోలీసులు రూ.34 లక్షలు (1700ల రూ.2వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. కరంబయంలో కొత్త ఇల్లు కొనుగోలు చేశామని, ఇంటి యజమానికి డబ్బు చెల్లించేందుకు వెళ్తున్నామని పీర్‌ మహ్మమద్‌ చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ వారికి ఎలా అందుబాటులోకి వచ్చిందనే అనుమానంతో పోలీసులు నలుగురినీ అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, ఈరోడ్‌ జిల్లా మొడచ్చూర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఒక కారు నుంచి రూ.36లక్షలు (రూ.2వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు.

సేలం పోస్టాఫీసులో రూ. 45 లక్షల పాతనోట్ల మార్పిడి
పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారే తన సహచర అధికారుల సాయంతో పాత కరెన్సీని మార్చిన సంఘటనను సీబీఐ అధికారులు రట్టు చేశారు. తమిళనాడులోని సేలం పోస్టల్‌ కారా>్యలయం అధికారులు కమిషన్‌ పుచ్చుకుని రూ.45 లక్షలు మార్చినట్లు సీబీఐ అధికారులకు సమాచారం అందింది. ఈ నెల 15న సేలం సూరమంగళం పశ్చిమకోట ప్రధాన తపాల కార్యాలయంలో తనిఖీలు చేయగా లెక్కల్లో చూపని రూ.45 లక్షల పాతనోట్లను గుర్తించారు. 20 నుంచి 30 శాతం కమీషన్‌పై ప్రధాన పోస్ట్‌మాస్టర్‌ వాసుదేవన్, క్యాషియర్‌ శేఖర్, మరో ఉద్యోగి పాత కరెన్సీని మార్చినట్లు తేలింది.

రైల్వే స్టేషన్లలోను అక్రమంగా నగదు మార్పిడి
ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినెస్‌లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తోన్న కే.ఎల్‌ భోయార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 8.22 లక్షల మేర రద్దైన నోట్లను మార్పిడి చేసినందుకు నేర పూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీఎస్టీ ముంబై, థానేలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్లలో రూ. 8.22 లక్షల విలువైన పాత నోట్లు తీసుకుని రూ. 2 వేలు, రూ. 100 నోట్లు ఇచ్చినట్లు విచారణలో సీబీఐ గుర్తించింది.

10 గ్రా. 44 వేలకు కొనుగోలు..2.5 కిలోల బంగారం స్వాధీనం
ఈడీ అధికారులు శనివారం పంజాబ్‌ మొహాలీలోని మహారాజా టైలర్‌ షాపు నుంచి రూ. 30 లక్షల నగదు, రూ. 2.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకుంది. ఇందులో రూ. 18 లక్షల మేర రూ. 2 వేల నోట్లు, మిగతా రూ. 100, రూ. 50 నోట్ల ఉన్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. నోట్ల రద్దు నిర్ణయం అనంతరం టైలర్‌ షాపు నిర్వాహకులు 10 గ్రాముల బంగారం రూ. 44 వేల చొప్పున 2.5 కిలోలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం ఈడీ అధికారులు చండీగఢ్‌లోని వస్త్ర వ్యాపారి నుంచి రూ. 2.19 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

నోయిడా యాక్సిస్‌పై ఈడీ కేసు
నోయిడాలోని యాక్సిస్‌ బ్యాంకు అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి వివరాల్ని అతనికి తెలియకుండా ఖాతా తెరిచేందుకు వాడుకున్నందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ మనీ ల్యాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. తన గుర్తింపును ఫోర్జరీ చేశారని, తన పేరుపై కరెంట్, సేవింగ్స్‌ ఖాతాల్ని తెరచారంటూ ఎన్‌.పాశ్వాన్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింది ఈడీ నేరపూరిత కేసును దాఖలు చేసింది. ఇటీవలే ఈ బ్యాంకులోని వివిధ ఖాతాల్లో రూ. 60 కోట్ల మేర అక్రమ నగదును గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ వాటిని సీజ్‌ చేసింది.

రైల్వే స్టేషన్లలోనూ అక్రమంగా నగదు మార్పిడి
ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినెస్‌లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తోన్న కే.ఎల్‌ భోయార్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 8.22 లక్షల మేర రదై్దన నోట్లను మార్పిడి చేసినందుకు నేర పూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. సీఎస్టీ ముంబై, థానేలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్లలో రూ. 8.22 లక్షల విలువైన పాత నోట్లు తీసుకుని రూ. 2 వేలు, రూ. 100 నోట్లు ఇచ్చినట్లు విచారణలో సీబీఐ గుర్తించింది.

బెంగళూరులో రూ. 5.2 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం
బెంగళూరులో మరోసారి భారీగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సమీపంలోని సర్కిల్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న రూ.5.2 కోట్ల విలువైన కొత్త 2 వేల నోట్లను కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. రదై్దన పెద్దనోట్లను మార్చుకునేందుకు ఇద్దరు వ్యక్తులు కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వచ్చారు. మధ్యవర్తుల ద్వారా పని పూర్తిచేసుకుని రూ.5.2కోట్లను తరలిస్తుండగా పోలీసులకు దొరికిపోయారు. వారిని విచారించగా తొలుత రియల్‌ ఎస్టేట్‌కు చెందిన నగదుగా పేర్కొన్నారు. ఐటీ అధికారులు మరింత లోతుగా విచారించగా... అది ఒక నగల దుకాణానికి చెందిన నగదుగా తేలింది. పట్టుబడ్డ ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఐటీ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన విజయ్‌ తనకు వచ్చిన రూ.22లక్షల కమిషన్‌తో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. అరెసై్ట ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement