తెలంగాణకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన కొద్ది రోజుల్లోనే మరొక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రం దృష్టిపెట్టింది.
న్యూఢిల్లీ: తెలంగాణకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన కొద్ది రోజుల్లోనే మరొక రాష్ట్ర డిమాండ్‌పై కేంద్రం దృష్టిపెట్టింది. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌ను పరిశీలించేందుకు తొలిసారి ఏకసభ్య కమిటీని నియమించింది. ఇందులో ఉండే కేంద్ర మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అన్ని వర్గాలను సంప్రదించి నివేదిక రూపొందిస్తారు. దీనికి కేంద్రం 9 నెలల గడువిచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తర్వాత అస్సాం ఉత్తర ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నదిని ఆనుకుని ఉండే బోడోలాండ్‌లో కూడా ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఉద్యమాలు పెల్లుబికాయి. 2003లో బోడోలాండ్ ప్రాంతీయ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రత్యేక డిమాండ్‌పై వాళ్లు వెనక్కితగ్గలేదు.