జయకు బాబు లేఖ
హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ మేరకు జయలలితకు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని తెలిపారు. అలాగే తెలుగు భాషను రెండో బోధన భాషగా చేయాలని ఆయన జయలలితను కోరారు.
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను రద్దు చేస్తు జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జయలలిత ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని జయలలితకు చంద్రబాబు లేఖ రాశారు.