పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు | Civilian injured in Pakistan firing in Jammu region | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు

Published Fri, Sep 18 2015 9:23 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

Civilian injured in Pakistan firing in Jammu region

జమ్మూ : పాకిస్థాన్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం సాధారణ నియంత్రణ రేఖపై పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడు మహమ్మద్ అష్రాఫ్గా గుర్తించినట్లు తెలిపారు.

అతడిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. క్షతగాత్రుడిది పూంచ్ జిల్లాలోని బసోని గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఈ రోజు ఉదయం నుంచే కాల్పులు ప్రారంభించిందని.. వెంటనే అప్రమత్తమైన భారత్ సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగిందన్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement