
గృహిణిపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్టు
పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో గృహిణిపై అత్యాచారం చేసిన కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్ అరెస్టయ్యాడు. బెల్డా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఇంట్లోకి చొరబడి మరీ నిఖిల్ మండల్ అనే కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అతడిని పట్టుకుని చితక్కొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మండల్ను అత్యాచార కేసులో అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ వందనా వరుణ్ చంద్రశేఖర్ తెలిపారు.