మద్యంసీసాతో ఆ అమ్మాయి.. షాకింగ్ నిజం! | Covert advertising on this French Instagram profile | Sakshi
Sakshi News home page

మద్యంసీసాతో ఆ అమ్మాయి.. షాకింగ్ నిజం!

Published Mon, Oct 10 2016 12:05 PM | Last Updated on Fri, Aug 17 2018 7:49 PM

మద్యంసీసాతో ఆ అమ్మాయి.. షాకింగ్ నిజం! - Sakshi

మద్యంసీసాతో ఆ అమ్మాయి.. షాకింగ్ నిజం!

ఇన్‌స్టాగ్రామ్‌లో లూయిస్‌ డీలెజ్‌ అనే అమ్మాయి ఖాతా ఇటీవలికాలంలో బాగా ఫేమస్‌ అయింది. పారిస్‌కు చెందిన ఈ అమ్మాయి అందరిలాగే విభిన్న ప్రాంతాలను సందర్శిస్తూ.. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. కానీ, అన్నీ ఫొటోలను ఆమె చేతిలో కచ్చితంగా మద్యం సీసానో, పెగ్గు గ్లాసో కనిపించేది. టన్నులకొద్దీ హ్యాష్‌ట్యాగులు పెట్టి ఆమె పెట్టే ఈ ఫొటోలకు వేలకొద్దీ లైకులు దక్కేవి. ఈ అందమైన అమ్మాయి ఎందుకు నిత్యం మద్యం తాగుతూ.. సిగరెట్‌ కాలుస్తూ ఆ ఫొటోలను పెడుతుందని అనే అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు ఆందోళన కూడా వ్యక్తం చేసేవారు.

కానీ, ఈ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు సంబంధించిన ఓ షాకింగ్‌ నిజాన్ని తాజాగా వెల్లడించారు. నిజానికి లూయిస్‌ డిలెజ్‌ అనే అమ్మాయి లేదు. కానీ ఆ పేరుతో ఓ కల్పిత ఖాతాను తెరిచి.. అందులో మద్యం తాగుతూ షికారు చేసే ఓ అందమైన అమ్మాయి ఫొటోలను నిత్యం పోస్టు చేస్తూ వచ్చారు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కోవర్ట్‌ ప్రచారమిది. ప్రముఖ వాణిజ్య కంపెనీలు రహస్య ప్రచారాలతో తమ ఉత్పత్తులకు మంచి పేరుతో తెచ్చుకోవడానికి కోవర్ట్ అడ్వర్టైజింగ్‌ను చేపడతాయి. అదేవిధంగా యువతలో మద్యపానం అవలక్షణాల గురించి అవగాహన కల్పించేందుకు ‘అడిక్ట్ ఎయిడ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ విధంగా కోవర్ట్‌ ప్రచారాన్ని నిర్వహించింది.

మద్యపానానికి బానిసలై యువత అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఈ వ్యసనంపై ప్రచారం కల్పించేందుకు వినూత్నరీతిలో ఆ సంస్థ ప్రచారం చేపట్టింది. తమ ప్రచారం విజయవంతమైందని పేర్కొన్న ఆ సంస్థ.. తాజాగా ఇది కల్పితమైన ఖాతా అని అసలు రహస్యాన్ని వెల్లడిస్తూ ఓ వీడియోను లూయిస్‌ డిలెజ్‌ ఖాతాలో పెట్టింది. యువతలో అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ అసాధారణమైన కోవర్ట్‌ ఆపరేషన్‌పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement