
దిశ మార్చుకున్న మేఘాలు
హైదరాబాద్: క్యుములో నింబస్ మేఘాలు దిశమార్చుకున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరం వైపుగా మేఘాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ రోజు(శనివారం) హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వరంగల్, కరీంనగర్,నిజామాబాద్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
విదర్భ కేంద్రంగా దట్టంగా క్యుములో నింబస్ మేఘాలు అలుముకున్నాయని తెలిపారు. ముంబాయి నుంచి దామన్ వరకు మేఘాలు విస్తరించాయన్నారు. ఆదిలాబాద్, నాందేడ్, చంద్రాపూర్, పర్బనీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.