
పట్టుతప్పిందా.... ఫలహారమే
అమెరికాలోని కొలరాడోలో ఓ చిన్ననదిపై జోష్ బ్యూడోయిన్ చేసిన సాహసమిది. నదికి ఇరువైపులా ఓ తాడుకట్టి దాని మీదుగా నడిచాడు. ఇందులో విశేషం ఏముందంటారా? ఫోటోను జాగ్రత్తగా చూడండి. ఆకలిగొన్న మొసళ్లు ఓ ఏడెనిమిది ఆవురావురుమంటూ అతనెప్పుడు నదిలో పడిపోతాడా... పండగ చేసుకుందామా అని ఎదురుచూస్తున్నాయి. పట్టుతప్పాడంటే మొసళ్లకు ఫలహారమే. అయితే సాహసమే ప్రవృత్తిగా గల బ్యూడోయిన్ చాలా జాగ్రత్తగా నదిని దాటేశాడు. మొసళ్లు నిరాశ చెందకూడదని వాటికి మాంసం ముక్కలు వేశాడు.