లక్నో: తమను కాదని పరీక్ష రాసిందన్న అక్కసుతో దళిత బాలిక(17)పై కిరోసిన్ పోసి నిప్పంటించారో నలుగురు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో గురువారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు బాధితురాలు హాజరయిందన్న కోపంతో నిందితులు ధిరజ్ యాదవ్, అతడి సోదరులు అర్వింద్, దినేష్ వారి తండ్రి రాంపర్వేష్ యాదవ్ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తున్న బాలికను బయటకు ఈడ్చుకొచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారని చెప్పారు. 70 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తాను చదువుకొనసాగించడం నిందితులకు ఇష్టం లేదని బాధితురాలు తెలిపింది. స్కూల్ లో ప్రతీ పరీక్షలో వారు ఫెయిలయ్యారని అందుకే తన చదువుకు అడ్డుకోవాలని చూశారని చెప్పింది. కొన్ని నెలల క్రితం ధిరజ్ తన ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని, ఈ సందర్భంగా తమ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిందని వెల్లడించింది. ధిరజ్ తనపైనా కూడా దాడి చేశాడని బాధితురాలి సోదరుడు తెలిపాడు.
తమను కాదని పరీక్ష రాసిందని...
Published Sat, Mar 7 2015 2:03 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement