'కుట్రలు, కుతంత్రాలకు సీఎం మరోరూపం' | Damodara Rajanarasimha takes on kiran kumar Reddy | Sakshi
Sakshi News home page

'కుట్రలు, కుతంత్రాలకు సీఎం మరోరూపం'

Feb 5 2014 3:49 PM | Updated on Jul 29 2019 5:31 PM

'కుట్రలు, కుతంత్రాలకు సీఎం మరోరూపం' - Sakshi

'కుట్రలు, కుతంత్రాలకు సీఎం మరోరూపం'

ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కుట్రలు, కుతంత్రాలకు సీఏం మరో రూపమని ఆయన విమర్శించారు.

కిరణ్కు నైతిక విలువలుంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు.  సీడబ్ల్యూసీ నిర్ణయానికి  కట్టుబడి ఉంటామని అందరూ అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లుపై సీఎం వ్యవహరశైలి అమానుషమని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆగదని, ఈ నెల 15వ తేదీ కల్లా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లుకు బీజేపి మద్దతిస్తుందనే నమ్మకముందని ఉపముఖ్యమంత్రి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement