నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు | December 16 gang rape verdict deferred till 12:30 pm today | Sakshi
Sakshi News home page

నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు

Published Tue, Sep 10 2013 10:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు

నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు

న్యూఢిల్లీ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన పారా మెడికల్ విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు తుది తీర్పు  వెలువడనుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం ఉదయం పోలీసులు తీహార్ జైలు నుంచి సాకేత్ కోర్టుకు తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఏపీ సింగ్‌, వివేక్‌ శర్మ, సదాశివగుప్తా, ముఖేశ్‌ అత్యాచారం, హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితులపై నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ 85 మంది సాక్షులను విచారించింది. నిందితుల తరపున 17 మంది సాక్ష్యమిచ్చారు.

డిసెంబరు 16, 2012న దక్షిణ ఢిల్లీలో ఓ కదులుతున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చివరకు బాధిత యువతి సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్‌ మార్చి 11న ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై విచారణ నిలిచిపోయింది. మరో నిందితుడైన కౌమార వ్యక్తికి శనివారం బాలల న్యాయస్థానం (జువైనల్‌ జస్టిస్‌ బోర్డు) మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement