Delhi gang-rape
-
రహస్య ప్రాంతానికి బాలనేరస్తుడి తరలింపు!
న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడిని శనివారం జువైనల్ హోం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. సెక్యూరిటీ కారణాలకి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అతడిని అక్కడ నుంచి తరలించినట్లు తెలుస్తోంది. కాగా జువైనల్ నేరస్తుడు ఆదివారం విడుదల కానున్నాడు. మహిళలపై జరిగిన అకృత్యాల్లో అత్యంత హేయమైనదిగా భావించే నిర్భయ ఉదంతంలో దోషిగా నిరూపితుడై, మూడేళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాలనేరస్తుడు(ఇప్పుడతని వయసు 20 ఏళ్లు) డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలనేరస్తుడు విడుదలయ్యే రోజు.. జువైనల్ హోం వద్దకు అతడి కుటుంబ సభ్యులను రప్పించి, తిరిగి అందరినీ సురక్షితంగా స్వగ్రామం చేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చును ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ భరించనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే బాల నేరస్తుడు హోమ్ నుంచి విడుదలయిన తర్వాత, తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు అతడికి సహకరిస్తామని, టైలర్ షాప్ ఏర్పాటుచేసుకునేందుకుగానూ 10వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపుబాల నేరస్తుడి విడుదలను నిరసిస్తూ బాధితురాలు జ్యోతిసింగ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు శనివారం సాయంత్రం జువైనల్ హోం వద్ద నిరసనకు దిగారు. -
నా కూతురు పేరు జ్యోతిసింగ్
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ‘నిర్భయ’ తల్లి వెల్లడి న్యూఢిల్లీ: దేశప్రజల మదిలో ‘నిర్భయ’గా నిలిచిపోయిన తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని మూడేళ్లక్రితం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై ప్రాణాలుకోల్పోయిన యువతి తల్లి వెల్లడించింది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగి మూడేళ్లు గడిచిన సందర్భంగా బుధవారం ఢిల్లీలో మహిళా, పౌరసంఘాలు జంతర్‌మంత్ వద్ద నిర్వహించిన ‘నిర్భయ చేతన దివస్’ నివాళి కార్యక్రమంలో యువతి తల్లి ఆశాదేవి మాట్లాడారు. ‘నా కూతురు పేరు జ్యోతిసింగ్. నా కూతురు పేరు చెప్పడానికి నేనేం సిగ్గుపడట్లేదు. రేప్‌లాంటి అమానుషమైన నేరాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలి.’ అన్నారు. మహిళాసమస్యలపై పార్టీలకతీతంగా ఎంపీలు ఏకం: మహిళాసమస్యలపై యువతలో అవగాహన కల్పించేందుకు పార్టీలకతీతంగా 20 మంది ఎంపీలు ఏకమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలె(ఎన్సీపీ), గౌరవ్ గొగోయ్(కాంగ్రెస్), ప్రీతమ్ ముండే, శతాబ్ది రాయ్(టీఎంసీ)సహా 20 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి లింగ సమానత, మహిళావిద్య, మహిళాసాధికారత వంటి అంశాలపై తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. కాగా, డబ్బు లేని కారణంగా నిర్బంధంలో ఉన్న వారికి బెయిల్ మంజూరులో జాప్యం జరగడంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని కేసు వాదనకు మంచి లాయర్లను వినియోగించాలని సూచించింది. -
'నిర్భయ' కేసులో బాలనేరస్తుడి విడుదల ఆపేందుకు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో బాలనేరస్తుడి (జువెనైల్)గా ఉన్న నిందితుడు మరో మూడు వారాల్లో జైలు నుంచి విడుదల కానున్నాడు. 2012లో అత్యంత కిరాతకంగా విద్యార్థినిపై అత్యాచారం జరిపిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన అతణ్ని మరికొంతకాలం జైలులోనే ఉంచేందుకు అతనిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) ప్రయోగించాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే సీనియర్ పోలీసులు అధికారులు న్యాయనిపుణులను కలిసి చర్చించారు. ప్రస్తుతం అతని వయస్సు 21 సంవత్సరాలు. ఢిల్లీ హైకోర్టు బాంబు పేలుళ్ల నిందితుడు అతన్ని ప్రేరేపించాడని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడైన నేపథ్యంలో అతనిపై ఎన్ఎస్ఏ ప్రయోగించే అవకాశముందా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని 12 నెలలపాటు జైలులో ఉంచవచ్చు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు అతని విడుదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అతని విడుదలను ఆపేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖతోపాటు, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరగా జాతీయ మానవహక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించారు. 'ఇప్పుడు పోలీసులు ఆలోచించడం కాదు చర్యలకు ఉపక్రమించాలి' అని నిర్భయ తండ్రి బద్రినాథ్ మీడియాకు తెలిపారు. నేరగాళ్లకు ఎలాంటి హక్కులు ఉండరాదని పేర్కొన్నాడు. నిర్భయగా పేరొందిన వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన సమయంలో జువెనైల్ వయస్సు 18 సంవత్సరాలకు కొన్ని నెలలు మాత్రమే తక్కవ. దీంతో అతన్ని బాలనేరస్తుడిగా పరిగణించి మూడేళ్ల పాటు సంస్కరణ గృహానికి తరలిస్తూ శిక్ష విధించారు. అయితే నిర్భయపై జరిగిన అమానుష హింసలో జువెనైల్ పాత్ర కూడా ఉందని, అతన్ని కూడా మిగతా నిందితుల మాదిరిగానే పరిగణిస్తూ.. కఠిన శిక్ష విధించాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
చారిత్రాత్మక తీర్పు
మేడ్చల్/ ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సరైందేనని, చారిత్రాత్మకమని పలువురు పేర్కొంటున్నారు. తీర్పునివ్వడంలో ఆలస్యం చేస్తే దోషులు తప్పించుకునే వీలుందని, అలా కాకుండా నేరస్తులు పట్టుబడగానే ఉరిశిక్ష అమలు చేయాలని అం టున్నారు. అలాంటివారిని బహిరంగంగా ఉరి తీయాలని అభిప్రాయపడుతున్నారు. సరైన శిక్ష నిర్భయ కేసులో దోషుల్లో నలుగురికి ఉరిశిక్ష విధించడం చారిత్రాత్మక తీర్పు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదని ఈ తీర్పుతో అందరికీ తెలిసి వస్తుంది. నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తే గాంధీజీ కలలు కన్నట్లు ఆడవారు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగే రోజు వస్తుంది. - శోభ, ఎంపీడీఓ, మేడ్చల్ నిర్భయ చట్టాన్ని పటిష్టం చేయాలి నిర్భయ కేసులో నేరస్తులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడం హర్షణీయం. ఇలాంటి తీర్పుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలనే ఆలోచన కూడా మదిలోకి రాదు. నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి. - హైమావతి, అంగన్వాడీ కార్యకర్త, అత్వెల్లి నేరస్తులకు శిక్ష పడాల్సిందే నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో ఒకరిని మైనరని మూడేళ్ల జైలు శిక్ష విధించడం సబబుకాదు. అత్యాచారాలకు అడ్డురాని మైనారిటీ శిక్షలకు ఎలా వస్తుంది..? నేరం చేసిన వాడు మైనరైనా మేజరైనా ఒకటే. శిక్ష పడి తీరాల్సిందే. -రాగజ్యోతి, మాజీ సర్పంచ్, మునిరాబాద్ బహిరంగంగా ఉరితీయాలి ఆడవారిపై అకృత్యాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరి తీయాలి. నాలుగు గోడల మధ్య ఉరితీస్తే ఎవరికీ తెలి యదు. బహిరంగంగా ఉరి తీయడం వల్ల శిక్షలంటే ఎలా ఉంటాయో ఉన్మాదులకు తెలిసివస్తుంది. - జ్యోతిరెడ్డి, ఈఓపీఆర్డీ, మేడ్చల్ పైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వొద్దు నిందితులకు పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వకూడ దు. నేరం చేశారని రుజువు కాగానే వెంటనే శిక్ష అమలు చేయాలి. నిర్భయ కేసులో న లుగురికి ఉరిశిక్ష విధించడం హర్షణీయం. మైనర్ అని ఒకరికి మూడేళ్ల జైలు శిక్షతో సరిపెట్టడం సరికాదు. - లక్ష్మివాసన్, చంటిప్రసన్న కేంద్రం అధ్యక్షురాలు నిర్భయ ఆత్మకు శాంతి నిర్భయ కేసులో దోషులకు సరైన శిక్షే పడింది. ఆలస్యమైనా నిర్భయ ఆత్మకు శాంతి చేకూరే విధంగా కోర్టుతీర్పు వచ్చింది. ముందు ముందు మరెవ్వరూ చిన్నారులు, మహిళలపై ఇలాంటి లైంగిక దాడులు పాల్పడకుండా ఉండడానికి దోషులకు బహిరంగ ఉరిశిక్ష విధించాలి. ఇకపై ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక మహిళా పోలీసులను నియమించాలి. - వేముల మమత గౌడ్, ఘనాపూర్ మాజీ సర్పంచ్, నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీత చట్టాలు కఠినతరం కావాలి మహిళలపై రోజురోజుకు నేరాలు పెరిగిపోతు న్నాయి. వాటిని నిరోధించడానికి చట్టాలను కఠినతరం చేయాలి. సక్రమంగా అమలయ్యేలా చూడాలి. నిర్భయ కేసులో నిందితులను శిక్షించడంతో ఇలాంటి నేరాలు చేయాలనుకునేవారు వెనుకంజ వేస్తారు. త్వరగా శిక్షను అమలు చేయడంతో చట్టాల పట్ల గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. - విద్యాధరి, బీటెక్ విద్యార్థిని, కొర్రెముల -
నిర్భయ తీర్పును స్వాగతించిన వైఎస్ఆర్సిపి
-
ఉరిశిక్ష అమలుపై చర్చ Part 3
-
ఉరిశిక్ష అమలుపై చర్చ Part 2
-
నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగింది : షిండే
-
నిర్భయ కేసులో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు
-
జడ్జిమెంట్ డే
-
నిర్బయ కేసులో నేటి మధ్యాహ్నం తుది తీర్పు
న్యూఢిల్లీ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన పారా మెడికల్ విద్యార్థిని నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం ఉదయం పోలీసులు తీహార్ జైలు నుంచి సాకేత్ కోర్టుకు తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఏపీ సింగ్, వివేక్ శర్మ, సదాశివగుప్తా, ముఖేశ్ అత్యాచారం, హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నిందితులపై నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ 85 మంది సాక్షులను విచారించింది. నిందితుల తరపున 17 మంది సాక్ష్యమిచ్చారు. డిసెంబరు 16, 2012న దక్షిణ ఢిల్లీలో ఓ కదులుతున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చివరకు బాధిత యువతి సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ మార్చి 11న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై విచారణ నిలిచిపోయింది. మరో నిందితుడైన కౌమార వ్యక్తికి శనివారం బాలల న్యాయస్థానం (జువైనల్ జస్టిస్ బోర్డు) మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.