మేడ్చల్/ ఘట్‌కేసర్ టౌన్, న్యూస్‌లైన్: నిర్భయ కేసులో దోషులకు ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సరైందేనని, చారిత్రాత్మకమని పలువురు పేర్కొంటున్నారు. తీర్పునివ్వడంలో ఆలస్యం చేస్తే దోషులు తప్పించుకునే వీలుందని, అలా కాకుండా నేరస్తులు పట్టుబడగానే ఉరిశిక్ష అమలు చేయాలని అం టున్నారు. అలాంటివారిని బహిరంగంగా ఉరి తీయాలని అభిప్రాయపడుతున్నారు.
సరైన శిక్ష
నిర్భయ కేసులో దోషుల్లో నలుగురికి ఉరిశిక్ష విధించడం చారిత్రాత్మక తీర్పు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరిశిక్ష తప్పదని ఈ తీర్పుతో అందరికీ తెలిసి వస్తుంది. నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తే గాంధీజీ కలలు కన్నట్లు ఆడవారు అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగే రోజు వస్తుంది. - శోభ, ఎంపీడీఓ, మేడ్చల్
నిర్భయ చట్టాన్ని పటిష్టం చేయాలి
నిర్భయ కేసులో నేరస్తులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడం హర్షణీయం. ఇలాంటి తీర్పుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాలనే ఆలోచన కూడా మదిలోకి రాదు. నిర్భయ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి.
- హైమావతి, అంగన్‌వాడీ కార్యకర్త, అత్వెల్లి
నేరస్తులకు శిక్ష పడాల్సిందే
నిర్భయ గ్యాంగ్‌రేప్ కేసులో ఒకరిని మైనరని మూడేళ్ల జైలు శిక్ష విధించడం సబబుకాదు. అత్యాచారాలకు అడ్డురాని మైనారిటీ శిక్షలకు ఎలా వస్తుంది..? నేరం చేసిన వాడు మైనరైనా మేజరైనా ఒకటే. శిక్ష పడి తీరాల్సిందే.
-రాగజ్యోతి, మాజీ సర్పంచ్, మునిరాబాద్
బహిరంగంగా ఉరితీయాలి
ఆడవారిపై అకృత్యాలకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరి తీయాలి. నాలుగు గోడల మధ్య ఉరితీస్తే ఎవరికీ తెలి యదు. బహిరంగంగా ఉరి తీయడం వల్ల శిక్షలంటే ఎలా ఉంటాయో ఉన్మాదులకు తెలిసివస్తుంది.
- జ్యోతిరెడ్డి, ఈఓపీఆర్‌డీ, మేడ్చల్
పైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వొద్దు
నిందితులకు పై కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఇవ్వకూడ దు. నేరం చేశారని రుజువు కాగానే వెంటనే శిక్ష అమలు చేయాలి. నిర్భయ కేసులో న లుగురికి ఉరిశిక్ష విధించడం హర్షణీయం. మైనర్ అని ఒకరికి మూడేళ్ల జైలు శిక్షతో సరిపెట్టడం సరికాదు.
- లక్ష్మివాసన్, చంటిప్రసన్న కేంద్రం
అధ్యక్షురాలు
నిర్భయ ఆత్మకు శాంతి
నిర్భయ కేసులో దోషులకు సరైన శిక్షే పడింది. ఆలస్యమైనా నిర్భయ ఆత్మకు శాంతి చేకూరే విధంగా కోర్టుతీర్పు వచ్చింది. ముందు ముందు మరెవ్వరూ చిన్నారులు, మహిళలపై ఇలాంటి లైంగిక దాడులు పాల్పడకుండా ఉండడానికి దోషులకు బహిరంగ ఉరిశిక్ష విధించాలి. ఇకపై ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక మహిళా పోలీసులను నియమించాలి.
- వేముల మమత గౌడ్, ఘనాపూర్ మాజీ సర్పంచ్,
నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రహీత
చట్టాలు కఠినతరం కావాలి
మహిళలపై రోజురోజుకు నేరాలు పెరిగిపోతు న్నాయి. వాటిని నిరోధించడానికి చట్టాలను కఠినతరం చేయాలి. సక్రమంగా అమలయ్యేలా చూడాలి. నిర్భయ కేసులో నిందితులను శిక్షించడంతో ఇలాంటి నేరాలు చేయాలనుకునేవారు వెనుకంజ వేస్తారు. త్వరగా శిక్షను అమలు చేయడంతో చట్టాల పట్ల గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
- విద్యాధరి, బీటెక్ విద్యార్థిని, కొర్రెముల
చారిత్రాత్మక తీర్పు
Published Sat, Sep 14 2013 12:49 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement