
చంద్రబాబుకు మోదీ ఫోన్
న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తనకెంతో బాధ కలిగించిందని ట్విటర్ లో పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలువాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్టు వెల్లడించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటలో 27మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.