గుండె తరుక్కుపోతోంది: చిరంజీవి | chandrababu responsible for pushkaralu stampede, says chiranjeevi | Sakshi
Sakshi News home page

గుండె తరుక్కుపోతోంది: చిరంజీవి

Published Tue, Jul 14 2015 1:27 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

గుండె తరుక్కుపోతోంది: చిరంజీవి - Sakshi

గుండె తరుక్కుపోతోంది: చిరంజీవి

హైదరాబాద్: పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నటుడు, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి అన్నారు. ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే బాధ్యుడని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే....

* మహాకుంభమేళలా కాకపోయినా ఘనంగా నిర్వహిస్తారనుకున్నాం
* తొక్కిసలాట షాక్ కు గురి చేసింది, ఘటన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది
* తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి
* మీడియాలో గొప్పులు చెప్పుకున్న చంద్రబాబు పుష్కర ఏర్పాట్లలో విఫలమయ్యారు
* పుష్కరాలు ప్రారంభమైన మొదటి గంటలోనే ప్రమాదం జరిగింది
* పుష్కరాలకు శాస్త్రీయ బద్ధంగా ఏర్పాట్లు చేయలేదు
* లక్షల మంది భక్తులు వచ్చే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చేతగానితనం కాదా?
* అన్ని అన్నీ తానే అని చెప్పుకున్న చంద్రబాబు దీనికి బాధ్యత వహిస్తారా, లేదా?
* చంద్రబాబు తన అంతరాత్మకు ఏం సమాధానం చెబుతారు?
* పాలన పరమైన అనుభవం లేని వ్యక్తి ప్రభుత్వ సలహాదారా?
* చనిపోయిన వారి రోదనలు మీకు విన్పించడం లేదా?
* మీడియా...బాధితుల తరపున నిలబడాలి
* మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి
* రాజీనామా చేస్తారా, లేదా అనేది చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నాం
* రాజమండ్రి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement