ఆప్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు | Delhi High Court Sends Notice to AAP | Sakshi
Sakshi News home page

ఆప్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Published Wed, May 20 2015 6:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

ఆప్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఆప్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్తో వివాదంలో తలమునకలై తీరిక లేకుండా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరొక కష్టమొచ్చిపడింది. ఢిల్లీ హైకోర్టు ఆపార్టీకి నోటీసులు పంపించింది. తన పార్టీ నుంచి 21 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆప్ ను ఆదేశించింది.

అయితే, తదుపరి విచారణ జరిగే జూన్ 1నాటికి వివరణ ఇవ్వాలని కోరిన కోర్టు.. ఆయన చేసిన నియామకాలపై మాత్రం స్టే విధించలేదు. ఈ ఏడాది మార్చి 13న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరి నియామకం చేశారు. రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఈ నియామకాలకు సంబంధించి పిటిషన్ వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement