నోట్ల రద్దుపై దేశీ వయగ్రా యాడ్‌! | demonetisation inspired ad by desi viagra company | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై దేశీ వయగ్రా యాడ్‌!

Published Thu, Dec 1 2016 11:17 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

నోట్ల రద్దుపై దేశీ వయగ్రా యాడ్‌!

నోట్ల రద్దుపై దేశీ వయగ్రా యాడ్‌!

పెద్దనోట్ల రద్దు యావత్‌ దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఒకవైపు నోట్ల రద్దు కష్టాలు, మరోవైపు నగదు రహిత డిజిటల్‌ లావాదేవీల గురించి జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు నోట్ల రద్దుతో ఫుల్‌ ఖుషి అయిన పేటీఎం ప్రధాని మోదీ ఫొటోతో దినపత్రికల్లో ఫుల్‌పేజీ వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు కూడా. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దుపై పేపర్లలో ఎన్నో యాడ్‌లు వచ్చాయి. బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, ఈ-వాలెట్‌ కంపెనీలు కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇచ్చాయి. కానీ వీటన్నింటిలోనూ పెద్దనోట్ల రద్దుపై ఓ దేశీ వయగ్రా కంపెనీ ఇచ్చిన యాడ్‌ మాత్రం నెటిజన్ల దృష్టి ఆకర్షించింది.

నోట్ల రద్దును సమర్థిస్తూ.. ఈ నిర్ణయానికి, లైంగిక సామర్థ్యం పెంచే తమ మాత్రలకు ఉన్న పోలికలను ఉటంకిస్తూ ఓ ప్రకటనను పేపర్లలో ఇచ్చింది.  ‘థింక్‌ డిమానిటైజేషన్‌. థింక్‌ స్టే ఆన్‌’అంటూ శీర్షిక పెట్టి.. ఇది చేదు మాత్ర కాదు.. ఇది పవర్‌ క్యాప్సుల్‌’ అంటూ.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న నాయకుడికి ఎందుకు అభినందనలు తెలుపాలో, ఎందుకు మద్దతునివ్వాలో వివరించింది.‘ఫిర్యాదులు చేయడం మానుకోండి. నిరంతరం కొనసాగుతూ ఉండండి’ అంటూ హిలేరియస్‌ వ్యాఖ్యానాన్ని చేసింది. సదరు దేశీ వయగ్రా కంపెనీ ఈ ప్రకటనను సరదాగా ఇచ్చిందో లేక సీరియస్‌గా ఇచ్చిందో తెలియదు కానీ, ఇందులో సరదా వివరణ మాత్రం నెటిజన్లను కితకితలు పెడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement