పులికి వేటాడే చాన్స్ ఇద్దామని.. | Depressed man jumps into tiger enclosure 'so he can be eaten' | Sakshi
Sakshi News home page

పులికి వేటాడే చాన్స్ ఇద్దామని..

Published Tue, Feb 18 2014 6:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

పులికి వేటాడే చాన్స్ ఇద్దామని..

పులికి వేటాడే చాన్స్ ఇద్దామని..

ఇతడి పేరు యాంగ్ జిన్హాయ్(27). చైనాలోని చెంగ్డూకు చెందిన యాంగ్‌కు కొంచెం స్క్రూలూజ్. పైగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడు. ఇటీవల స్థానిక జూకు వెళ్లిన ఇతడికి పులులు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా వేటాడకుండా.. అలా బోనుల్లో ఉండటం నచ్చలేదు. అందుకే వాటికి వేటాడే అవకాశం ఇవ్వడానికి తానే వాటికి ఫుడ్‌గా వెళ్తానంటూ బోనులో దూకాడు. అయితే, ఇతడిని చూసి ముందు ఓ పులి భయంతో పారిపోయింది. అయినా ఇతడు ఊరుకుంటేగా.. వాటి చుట్టూ చేరి డాన్సులేయడం మొదలెట్టాడు. ఇక అవి ఊరుకుంటాయా.. ఇదిగో ఇలా ఓ పులి ఈడ్చుకెళ్లిపోయింది. అయితే, యాంగ్ అదృష్టం బాగుండి.. దగ్గర్లోనే జూ సిబ్బంది ఉండటంతో వారా పులిని తరిమికొట్టి.. ఇతడిని రక్షించారు. ప్రస్తుతం యాంగ్ ఆస్పత్రిలో ఉన్నాడు. తర్వాత అతడిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement