
ఈ మ్యాజిక్.. మ్యాచ్‌కే హైలెట్!
రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను ధోని రనౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్.. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ..
బంతి స్టంప్స్‌కు తగలడం, టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ ధోని కొన్నిసార్లు ఇలా బంతిని పూర్తిగా అందుకోకుండా వికెట్ల పైకి మళ్లించిన ఘటనలు ఉన్నాయి.. ఈ సారి అతను వికెట్లకు బాగా దూరంలో ఉండి అత్యంత కచ్చితంగా ఇలా త్రో చేయగలగడం మ్యాచ్‌లోనే మ్యాజిక్ హైలెట్‌గా నిలిచింది. ధోనీ చేసిన మ్యాజిక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
Watch the Mahi magic on loop #INDvNZ https://t.co/btMoJF0xC3
— BCCI (@BCCI) 26 October 2016