కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. గొంతు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కావేరి ఆసుపత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేయనుండటంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సమస్యతో కరుణానిధి ఇదే ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.