ఈ చిన్నమ్మను మరిచిపోకండి:సుష్మా స్వరాజ్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుష్మా, ఎంపీ సుష్మా స్వరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిల్లు ఆమోదం పొందగానే మొత్తం క్రెడిట్ లో కొంత భాగాన్ని తనకూడా పంచాలన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రెడిట్ ఇస్తారు..బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ చిన్నమ్మకు కూడా మరిచిపోవద్దంటూ సుష్మ తన గురించి చెప్పుకున్నారు. బిల్లు ఆమోదం పొందగానే టీఆర్ఎస్ కేసీఆర్ అధ్యక్షుడు సోనియాతో పాటు, సుష్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో సీపీఎం ఎంపీల నినాదాలు చేశారు. కాగా ఇవాళ కాళరాత్రి అంటూ తృణమూల్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ బిల్లును ఆమోదించినట్లు లోక్సభ లో స్పీకర్ మీరాకుమార్ ప్రకటించడంతో సీమాంధ్ర సభ్యుల గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్రికత్ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటు ద్వారా ఈ తంతును ముగించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు సవరణలపై సభలో ఓటింగ్ జరుగుతోంది.
బిల్లుపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, ప్రతిపక్ష బిజెపి నేత సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. బిల్లు ఆమోదించే సమయంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్పర్స్ సోనియా గాంధీ సభలోనే ఉన్నారు.