సభలో బిల్లు ప్రవేశపెట్టలేదు: సుష్మా స్వరాజ్
పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టలేదని భావిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది అని సుష్మా అన్నారు. స్పీకర్ మీరాకుమార్ సభలోకి రాగానే గొడవలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి అని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది అని సుష్మా ఆరోపణలు చేశారు. తెలంగాణ బిల్లు అనుబంధ ఎజెండాలో పెట్టినట్టు మాకు సమాచారం అందించలేదు అని అన్నారు. లోకసభలో జరిగిన సంఘటనలన్నింటికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలి అని సుష్మా స్వరాజ్ ఆరోపించారు.