
అలలపై కలల నివాసం
నగర జీవితానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని....
నగర జీవితానికి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. కుటుంబంతో కలసి ఒక్కరోజైనా అలా జీవించాలని కోరుకోని వారుండరు! మరి ఆ ప్రకృతి సోయగాల నడుమ, నీటిపై తేలియాడే ఇంట్లో జీవితం గడిపేస్తే..! ఆహా అద్భుతంగా ఉంటుంది కదూ. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన వేన్ ఆడమ్స్, కేథరీన్ కింగ్ జంటకు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. అనుకున్నదే తడవుగా ‘టొఫినో’ సముద్ర తీరంలో నీటిపై 1992లో పూర్తి కలపతో ఈ తేలియాడే ఇల్లు నిర్మించుకున్నారు.
తమ ఇద్దరు పిల్లలతో అప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నారట. మరి వారికి తిండి, కరెంటు ఎలా అంటే.. అక్కడే గ్రీన్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకుని పండించుకుంటున్నారు. కరెంటు కూడా సోలార్ ప్యానెల్‌ల ద్వారా తయారుచేసుకుంటున్నారు. 20 ఏళ్లుగా ఈ ఇంటికి పలు మార్పులు చేస్తూ ఇలా అందంగా తీర్చిదిద్దుకున్నారు..