న్యూఢిల్లీ: దేశాన్ని పరిశుభ్రం చేయడానికి చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’తో దేశంలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం విజయవంతయ్యేంతవరకు కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి'అని మోదీ స్పష్టం చేశారు. దేవెగౌడ కర్ణాటకలోని హసన్ రైల్వేస్టేషన్‌లో చీపురు పట్టి ఊడ్చడంపై మోదీ స్పందించారు.
మాజీ ప్రధాని దేవెగౌడ కూడా ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇది బలమైన సంకేతం’ అని శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, శనివారం రాష్ట్రపతి భవన్‌లో స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు.