
ఈవ్‌టీజర్‌కు చెప్పుదెబ్బలు
కాకినాడ : ఓ మహిళతో సెల్‌ఫోన్ సంభాషణలో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఓ ఈవ్‌టీజర్‌ను ఆమె గురువారం కలెక్టరేట్ వద్ద చెప్పుతో కొట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. కాకినాడ సంజయ్‌నగర్‌కు చెందిన చిన్న పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతడు తన సెల్‌ఫోన్ నుంచి కాకినాడకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. ఆమె రాంగ్ నంబర్ అని చెప్పి పెట్టేసినా అతడు తరచూ ఫోన్ చేస్తూ అసభ్యకరంగా సంభాషిస్తున్నాడు.
ఈ విషయాన్ని తన స్నేహితురాలి కి చెప్పింది. ఆ మహిళ గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పనిచేసుకుంటోంది. ఇంతలో చిన్నా ఆమెకు ఫోన్ చేశాడు. తన స్నేహితురాలి సూచన మేరకు ఆ మహిళ చిన్నతో ఫోన్‌లో మాట్లాడి కలెక్టరేట్ వద్ద టిఫిన్ తీసుకుని రమ్మంది. దూరం నుంచి అతడు ఫోన్ చేయడాన్ని గమనించి స్నేహితురాలితో కలిసి అతడి వద్దకు చేరుకుని చెప్పుతో కొట్టింది. స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నను వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు.