షోపియాన్ జిల్లాలోని రామనగరి గ్రామంలో మాజీ తీవ్రవాది షబ్బీర్ అహ్మద్ మీర్ (33) ను అతని నివాసంలో నిన్న ఆగంతకులు హత్య చేశారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే మరణించాడని పోలీసులు చెప్పారు.
గతంలో అతడు నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్లో కీలకంగా వ్యవహారించాడని తెలిపారు. అనంతరం అతడు భద్రత దళాలకు లొంగిపోయి తీవ్రవాదానికి స్వస్థి చెప్పుతున్నట్లు ప్రకటించాడు. ఆ క్రమంలో అతడు జనజీవన స్రవంతిలో కలసి తన గ్రామంలో జీవనం సాగిస్తున్నాడని పోలీసులు వివరించారు. అయితే అతడిని హత్య చేసింది తామే అని ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ పేర్కొనలేదని పోలీసులు చెప్పారు.