వాల్స్ట్రీట్ అంచనాలను ఓడించిన ఫేస్బుక్ | Facebook Trounces Wall Street Estimates, Shares Hit All-Time High | Sakshi
Sakshi News home page

వాల్స్ట్రీట్ అంచనాలను ఓడించిన ఫేస్బుక్

Published Thu, Jul 28 2016 9:04 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Facebook Trounces Wall Street Estimates, Shares Hit All-Time High

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్  జూన్ త్రైమాసికంలో ఊహించని ఫలితాలు సాధించింది. అత్యంత ప్రజాదరణ  పొందిన ఈ ప్లాట్ ఫాం  యూజర్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. క్వార్టర్లీ ఆదాయం ఏకంగా 59.2 శాతానికి పైగా నమోదుచేసి వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. 59.2 శాతం వృద్ధితో 6.44  బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఎనలిస్టులు  6.02  బిలియన్ డాలర్లుగా  అంచనావేశారు. 

63 శాతం వృద్ధితో అడ్వర్టయిజింగ్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 6.24 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.  ఇందులో 84 శాతంకు పైగా మొబైల్ యూజర్ల నుంచి వచ్చిందేనని ఫేస్ బుక్ కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇది 76 శాతంగా కావడం విశేషం.  మార్కెట్ పరిశోధన సంస్థ ఫాక్ట్ స్ర్టీట్ అంచనా  ప్రకారం  5.80  బిలియన్  డార్లుగా  ఉండనుందనే విశ్లేషకుల అంచనాను ఓడించి 6.24 బిలియన్ డాలర్లకు  చేరింది . అలాగే నెలవారీ వినియోగదారుల  సంఖ్యలో  బలమైన పెరుగుదలను నమోదు చేసి జూన్ 30 నాటికి  1.71 బిలియన్ సంఖ్యకు జంప్ చేసింది.  ఏడాది క్రితం 1.49 కోట్లు.

విశ్లేషకుల సమావేశంలో  పాల్గొన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు , సీఈవో మార్క జుకర్బర్గ్ తన కంపెనీ 10 సంవత్సరాల ప్రణాళికను పునరుద్ఘాటించారు. వచ్చే మూడు సంవత్సరాల్లోతమ యూజర్లను భారీగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యంగా   అభివృద్ది చెందిన దేశాలపై దృష్టి పెట్టినట్టు ప్రకటించారు. దీని ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, దాని భారీ యూజర్ బేస్ పెరగడం కొనసాగుతుంది దృష్టి సారించాయి, రాబోయే 10 సంవత్సరాల ఎక్కువ మంది ఆన్లైన్ ,  ఇంటర్నెట్ ప్రసార డ్రోన్స్ ద్వారా తమ ప్లాట్ ఫాం ద్వారా లబ్ది పొందడానికి కొత్త టెక్నాలజీ నిర్మించనున్నట్టు తెలిపారు. ఫేస్ బుక్ కు చెందిన ఇన్స్ట్రాగ్రామ్,  మెసెంజర్ సహా ఇతర అనువర్తనాలు  "డబుల్ డిజిట్ గ్రోత్"   సాధించాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జకర్బర్గ్ ప్రకటించారు.. తమ యూజర్ల  వృద్దిలో చాలా ఆశాజనకంగా ఉందని ఆసియా-పసిఫిక్ ఏరియాలో  ముఖ్యంగా  భారతదేశంలో  మంచి ప్రాధాన్యత లభిస్తోందని ముఖ్య ఆర్థిక అధికారి డేవిడ్ వెన్నర్   తెలిపారు.   గత అనేక త్రైమాసికాల్లో ఇక్కడ తమకు  స్థిరమైన అభివృద్ధి  లభిస్తోందని, భవిష్యత్తు అవకాశాలపై దృష్టి,  గ్లోబల్ సేల్స్ వనరుల పెట్టుబడి కొనసాగుతుందని రాయిటర్స్ తో చెప్పారు.

 పటిష్టమైన  ఆదాయ వృద్దిని సాధించడంతో  షేర్ ధరలో అత్యంత గరిష్ట స్థాయికి చేరింది. 5.4 శాతం లాభంతో ఆల్ టైం హైలో నిలిచింది.  నాలుగేళ్ల క్రితం మొదటిసారి పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన దానికంటే ఇది కొన్ని రెట్లు అధికమని కంపెనీ పేర్కొంది.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement