నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం | Fake call of Bomb threat in Nanded railway station | Sakshi
Sakshi News home page

నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

Published Mon, Jul 27 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు చుక్కలు చూపించింది.

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వేస్టేషన్‌లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు చుక్కలు చూపించింది. పైగా అతడు ‘నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను’ అనడంతో పోలీసు అధికారులు ఉరుకులు.. పరుగులు తీశారు. చివరకు బాంబు బూచీ వట్టిదేనని తేలిపోయింది. ఆగంతకుడిని కూడా 24 గంటలలో అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సందీప్ డోయిఫోడే ఆదివారం ఈ ఉదంతం వివరాలను విలేకరులకు వివరించారు. శనివారం ఉదయం 9.15కి నాందేడ్ పోలీస్ నియంత్రణ విభాగానికి ఫోన్ చేసిన ఆగంతకుడు ‘నా పేరు నరేంద్రమోదీ...నాందేడ్ రైల్వే స్టేషన్‌లో బాంబు ఉంది.

వెంటనే దానిని తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడతారని ఆశిస్తున్నాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సంబంధిత అధికారులు వెంటనే ఈ విషయూన్ని ఎస్పీ పరంజిత్‌సింహ దహియాకు చేరవేశారు. వెంటనే ఎస్పీతో పాటు మిగిలిన అధికారులు రైల్వేస్టేషన్‌కు బాంబుస్క్వాడ్‌తో చేరుకున్నారు. స్టేషన్ నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపట్టారు. పరిసరాలు మెుత్తం వెతికి ఏమీ లభించకపోవడంతో పోలీసులు నిష్ర్కమించారు. ఫోన్ డేటాను పరిశోధించి మాహూర్ తాలూకా ఆసోలీ గ్రామస్థుడు బలదేవు రాథాడ్ (28) ఈ కాల్ చేసినట్టు గుర్తించి అతడిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

పోల్

Advertisement