
నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం
నేను నరేంద్ర మోదీని...
సాక్షి, ముంబై: ‘నేను నరేంద్ర మోదీని. నాందేడ్ రైల్వేస్టేషన్‌లో ఎవరో బాంబు పెట్టారు’ అని ఓ ఆగంతకుడి బెదిరింపు ఘటనను మరవకముందే మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాందేడ్ జిల్లాలోని ముత్కేడ్ రైల్వే స్టేషన్‌లో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గురువారం తెల్లవారుజామున వదంతులు వినిపించాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిటెక్టర్ల సహాయంతో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.