Nanded railway station
-
నాందేడ్‌లో మరోమారు బాంబు కలకలం
సాక్షి, ముంబై: ‘నేను నరేంద్ర మోదీని. నాందేడ్ రైల్వేస్టేషన్లో ఎవరో బాంబు పెట్టారు’ అని ఓ ఆగంతకుడి బెదిరింపు ఘటనను మరవకముందే మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాందేడ్ జిల్లాలోని ముత్కేడ్ రైల్వే స్టేషన్లో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గురువారం తెల్లవారుజామున వదంతులు వినిపించాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిటెక్టర్ల సహాయంతో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
నాందేడ్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు చుక్కలు చూపించింది. పైగా అతడు ‘నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను’ అనడంతో పోలీసు అధికారులు ఉరుకులు.. పరుగులు తీశారు. చివరకు బాంబు బూచీ వట్టిదేనని తేలిపోయింది. ఆగంతకుడిని కూడా 24 గంటలలో అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ సందీప్ డోయిఫోడే ఆదివారం ఈ ఉదంతం వివరాలను విలేకరులకు వివరించారు. శనివారం ఉదయం 9.15కి నాందేడ్ పోలీస్ నియంత్రణ విభాగానికి ఫోన్ చేసిన ఆగంతకుడు ‘నా పేరు నరేంద్రమోదీ...నాందేడ్ రైల్వే స్టేషన్లో బాంబు ఉంది. వెంటనే దానిని తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడతారని ఆశిస్తున్నాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సంబంధిత అధికారులు వెంటనే ఈ విషయూన్ని ఎస్పీ పరంజిత్సింహ దహియాకు చేరవేశారు. వెంటనే ఎస్పీతో పాటు మిగిలిన అధికారులు రైల్వేస్టేషన్‌కు బాంబుస్క్వాడ్‌తో చేరుకున్నారు. స్టేషన్ నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించి గాలింపు చర్యలు చేపట్టారు. పరిసరాలు మెుత్తం వెతికి ఏమీ లభించకపోవడంతో పోలీసులు నిష్ర్కమించారు. ఫోన్ డేటాను పరిశోధించి మాహూర్ తాలూకా ఆసోలీ గ్రామస్థుడు బలదేవు రాథాడ్ (28) ఈ కాల్ చేసినట్టు గుర్తించి అతడిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.