గంగదేవిపల్లి గ్రామ సభలో సీఎం విసిరిన సెటైర్లు.. పంచ్ డైలాగులకు నవ్వులు పూశాయి. వాటిలో కొన్ని..
యాడికిబోయిన డప్పులు.. దండలే! నిజామాబాద్ జిల్లాల అంకాపూర్ అనే ఓ అద్భుతమైన ఊరున్నది. 1985ల నేను ఎమ్మెల్యే అయినంక మొదటిసారి అక్కడికి పొయిన. కాని నేను ఎమ్మెల్యేనని చెప్పలే. పేపర్ విలేకరినని చెప్పిన. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే పిచ్చిపిచ్చిగ జేత్తరు! శాలువ కప్పుతరు. గంగిరెద్దుకు ఏసినట్టు దండేత్తరు. ఇది మన దగ్గర అలవాటు లెక్క మారింది. ఏడికన్న పో. ఏడ పడితె ఆడ డప్పులు, దండలు, దట్టాలు (బాణసంచా)... గివే మోపైనయి. ఎమ్మెల్యే ఏ ఊరికన్న పోతే గా పెండ్లి పిల్ల, పెండ్లిపిల్లగాన్ని గూసోబెట్టరా, అందేందో అంటరు గాదు... ఆ.. గా మహారాజా కుర్చీలు! అవేత్తరు. దండలు ఏసేకాడా పంచాయితే. దండలేసెటప్పుడు అవి మంచిగుండాలని నీళ్లు సల్లుతరు. ఆ నీళ్ల తడికి అంగి మొత్తం తడుస్తది. ఆ దండలల్ల చిన్న చిన్న పురుగులుంటయి. ఒక్క రకమైన బాధ కాదది. ఎందుకింత నాకర్థం కాదు. ఇక్కడ దండల్లేవు. మహారాజ కుర్చీల్లేవు. ఎంత మంచిగున్నది! ఇదే గంగదేవిపల్లి
గొప్పదనమంటే... డిప్యూటీ సీఎం గింత ఉషారుగాడని తెలియదు
మన డిప్యూటీ సీఎం (కడియం శ్రీహరి) కూడ బాగ ఉషారున్న మనిషి. ఉషారని తెలుసు గని గింత ఉషారని తెల్వదు. అన్ని నాతోని జెప్పిచ్చుకుంటనే ఇంకేందో జెప్పమంటాండు. ఓ ఇంటి కాడ ఇల్లరికపు పెద్ద మనిషి ఉన్నడట. బయటికి పోతా పోతా అంటే ఇంటికాడి ఆడ మనిషి ‘బువ్వ ఉడుకుతాంది. సలన్నమున్నది తినిపో’ అన్నదట. అయితే ‘సలన్నం దింట, ఉడికినంక ఉడుకు బువ్వ కూడా తింట’ అన్నడట ఆ పెద్దమనిషి. గట్లున్నది మన డిప్యూటీ సీఎం ముచ్చట. గ్రామంల రెసిడెన్షియల్ స్కూల్ కావాలెనని అడుగుతాండు. నా తర్వాత నా అంత పెద్ద మనిషి ఆయన. విద్యామంత్రి కూడా ఆయనే. ఆయనే జూసుకుంటడు ఇవన్నీ...
ఆకట్టుకున్న సెటైర్లు
Published Tue, Aug 18 2015 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement