
137 ఏళ్ల రికార్డు బద‍్దలు...
137 ఏళ్ల తర్వాత అత్యంత తక్కువ ఉష్టోగ్రతలు గత ఫిబ్రవరిలో నమోదయ్యాయని న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ తెలిపింది.
1951-1980 మధ్య కాలంలోని ఫిబ్రవరి నెలల కంటే 1.1 డిగ్రీల తక్కువ టెంపరేచర్స్ 2017 ఫిబ్రవరిలో నమోదయ్యాయని పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల కంటే గత ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా ఉష్టోగ్రతలు నమోదు కావటం కూడా ఒక రికార్డేనని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన 1.3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి సరాసరి ఉష్ణోగ్రతలు 0.20 తక్కువ రికార్డయ్యాయని వివరించింది.
ఈ వివరాలను ప్రపంచవ్యాప్తంగా భూమితోపాటు సముద్ర జలాలపై ఉన్న దాదాపు 6,300 వాతావరణ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లెక్క కట్టినట్లు తెలిపింది. కాగా, 1880వ సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతల నమోదు ప్రారంభమయిందని, అంతకుమునుపు రికార్డుల్లో ఉన్న వాతావరణ వివరాలు కేవలం ఏదో ఒక ప్రాంతానికే పరిమితమైనవని తన నివేదికలో తెలిపింది.