నిప్పు రాజేసిన టిప్పు జయంతి | Fights in the tippu birth anniversary | Sakshi
Sakshi News home page

నిప్పు రాజేసిన టిప్పు జయంతి

Published Wed, Nov 11 2015 1:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నిప్పు రాజేసిన టిప్పు జయంతి - Sakshi

నిప్పు రాజేసిన టిప్పు జయంతి

కర్ణాటకలో ఘర్షణలు.. ఒకరి మృతి
♦ సీఎం వైఫ్యల్యం వల్లే: బీజేపీ
♦ బీజేపీయే వల్లే: సిద్ధ్దరామయ్య
 
 సాక్షి, బెంగళూరు: మైసూరు పులి టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో కన్నడ గడ్డపై మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొడుగు జిల్లా మడికేరిలో తిమ్మయ్య సర్కిల్ వద్ద జరిగిన ఇరువర్గాల ఆందోళనలో ఓ విశ్వ  హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత మరణించగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టిప్పు జయంతిని కన్నడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటాన్ని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ కొడగు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. జిల్లాలోని మడికేరిలో వీహెచ్‌పీ కార్యకర్తలు, ప్రత్యర్థులు ఓ కూడలిలో  రాళ్లు రువ్వుకున్నారు. 

పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో వీహెచ్‌పీ కొడగు జిల్లా ముఖ్యకార్యదర్శి కుట్టప్ప(60) మృతిచెందారు.  రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ.. ‘ఓ గొప్ప వ్యక్తి జయంతిని నిర్వహిస్తుంటే ఓర్వలేకే కొందరు ఆందోళన చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం’ అని అన్నారు. టిప్పు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని ఎవరూ అడగలేదని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే ప్రభుత్వం దీనికి తెరలేపి వివాదాలకు కారణమైందని మాజీ సీఎం, బీజేపీ నేతయడ్యూరప్ప విమర్శించారు.

 ‘టిప్పు హిందువు అయ్యుంటే’
 టిప్పు హిందువే అయి ఉంటే మహారాష్ట్రలో శివాజీకి ఉన్నంత పేరుప్రఖ్యాతులు వచ్చి ఉండేవని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ అన్నారు. బెంగళూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన టిప్పుజయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘బెంగళూరు నిర్మాణ కర్తగా కెంపేగౌడ అంటే నాకు గౌరవం ఉంది. అయితే ఆయన స్వాతంత్య్రసమరయోధుడు కాదు. దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కెంపేగౌడ పేరు బదులు టిప్పుపేరు పెట్టడమే సమంజసం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement