‘తిలక్‌’ నిధులు మింగేశారు! | Files Related To The Grant Of Rs 2.5 Cr For Film On Bal Gangadhar Tilak That Was Never Made Missing From Govt Records | Sakshi
Sakshi News home page

‘తిలక్‌’ నిధులు మింగేశారు!

Published Mon, Mar 20 2017 3:11 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

‘తిలక్‌’ నిధులు మింగేశారు!

‘తిలక్‌’ నిధులు మింగేశారు!

న్యూఢిల్లీ: బాల గంగాధర్‌ తిలక్‌పై సినిమా రూపొందించేందుకంటూ తీసుకున్న రూ. 2.5 కోట్ల నిధులను మింగేశారు. సినిమా కోసం 2005లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కావాలని  సమాచార హక్కు చట్టం ద్వారా వీఆర్‌ కమలా పుర్కర్‌ అనే వ్యక్తి సాంస్కృతిక శాఖకు దరఖాస్తు చేశారు. నిర్మాత వినయ్‌ ధుమాలేకు రూ.2.5 కోట్లు ఇచ్చామని, అయితే ఆయన సినిమాను రూపొందించలేదని ఆ శాఖ.. .సమాచార కమిషన్‌కు తెలిపింది.

రికార్డులేవీ తమ వద్ద లేవని చెప్పింది.  ‘ధుమాలేకి రెండు విడతల్లో మొత్తం డబ్బు బదిలీ చేశారు. కానీ అతడు సినిమా రూపొందించలేదు’ అని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు పేర్కొన్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై విచారణ జరపాలని, 60 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement