Ministry of Culture
-
నవ భారత ప్రణాళిక
ఒక సమాఖ్య దేశంగా భారత్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశంలోని భిన్నత్వాలన్నింటినీ కలిపి ఉంచే లక్ష్యంతో ఏర్పాటు చేసు కున్న రాజ్యాంగానికి పెను సవాలు ఎదురవు తోంది. భిన్న జాతులు, సంస్కృతులు, భాషల సమ్మేళనంతో కూడిన భిన్నత్వమే దీని ప్రత్యేకత. జనాభా కూర్పు కూడా ఈ దేశం హిందీ భాష, హిందుత్వ భావజాలంతోనిండి పోయేందుకు అవకాశం కల్పించదు.విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి!ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ తనదైన రీతిలో ఒక ప్రత్యేక జాతి లాంటిది. అందుకే రాజకీయ, ఆర్థిక విషయాల్లో వీటి మధ్య సమ తౌల్యతను కాపాడాల్సిన అవసరముంది. 2026లో ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పార్లమెంటులో కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉంటుంది. జనాభా నియంత్రణ ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను ఇచ్చేందుకు ఆ రాష్ట్రాలు చేసిన కృషికి లభించనున్న ప్రతిఫలమా ఇది!జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించని రాష్ట్రాలకు మరిన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలను సృష్టించటం ద్వారా ప్రోత్సాహ కాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క విషయమైతే స్పష్టం చేయాలి. ఈ పునర్విభజన ప్రకియను తక్షణం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.ఇది సాంకేతిక పరిజ్ఞాన యుగం. నాణ్యమైన విద్య ఉన్న వారే సామాజిక ఫలాలను నిర్ణయిస్తారు. నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నప్పటికీ ఉన్నత విద్యారంగం ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. ఉన్నత విద్య నాణ్యత కూడా ఆశించిన ప్రమాణాల మేరకు లేదు. కాబట్టి విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబి తాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), యూజీసీ (యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్) వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి. దేశానికి నాణ్యమైన ఆధునిక వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్య అవసరం. నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడేలా చేయాలి కానీ, పరిపాలన పేరిటకేంద్రం పెత్తనం చలాయించ కూడదు.పన్నుల వాటా 66 శాతానికి చేరాలి!రాష్ట్రాలు ఆర్థికంగా స్వావలంబన, స్వతంత్రత సాధించినప్పుడే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుంది. ఆర్థిక వనరుల విషయంలో రాష్ట్రాలకు మరిన్ని మార్గాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. పైగా ఇటీవలి కాలంలో కేంద్రం వద్దనే వనరులను కేంద్రీకరించే ధోరణి కనపడుతోంది. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాలకు దక్కాల్సిన పన్నుల వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి. కేటాయింపులు కూడా జనాభా, తీసుకొచ్చిన ఆదాయం, సగటు కంటే ఎంత ఎక్కువ ఉంది అనే అంశాలతో కూడిన సూచీ ఆధారంగా జరగాలి. రాష్ట్రాలకు అందాల్సిన మొత్తాల విడుదలల్లోనూ అనవసరమైన జాప్యాన్ని చూస్తున్నాం. రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర పథకాలకు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలు తమ ప్రణాళికలు, హామీ లను నెరవేర్చుకునేందుకు వీలుగా ఆదాయం ఎక్కడికక్కడ పంపిణీ జరిగేలా ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ద్వారా నిధుల విడుదలల్లో ఆలస్యం జరిగితే ఆర్బీఐ ప్రైమ్ లెండింగ్ రేట్లతో రాష్ట్రాలకు వడ్డీ చేర్చి ఇవ్వాలి. దేశాద్యంతం చరిత్ర, సంస్కృతులు ఒక్క తీరున లేవు. ప్రతి ప్రాంతంలోనూ తనదైన ప్రత్యేకత కలిగిన చారిత్రక, సాంస్కృతికకేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వపు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) వీటి నిర్వహణ, సంరక్షణల్లో ఘోరంగా విఫల మైంది. ఆకతాయిలు పలు స్మారకాలను ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉన్న నేపథ్యంలో వాటి సంరక్షణ, నిర్వహణ బాధ్యతలు ఆయా రాష్ట్రాలకే అప్పగించాలి. ఆయా వనరులపై కేంద్రం పెత్తనం చలాయించకుండా వెంటనే రాష్ట్రాలకు బదలాయించాలి. సంకుచిత సైద్ధాంతిక భావ జాలం కారణంగా ఏఎస్ఐ, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టే ధోరణి కనిపిస్తోంది. సహజ వనరులపై హక్కురైతుల నుంచి సేకరించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఈ సేకరణ ఒక రకమైన సబ్సిడీనే కాబట్టి... ఆయా నిధులను వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రాష్ట్రాలకే కేటాయించాలి. దేశాద్యంతం పండే పంటల్లో ధాన్యమే ఎక్కువ కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ ధాన్యం సేకరణకు కనీస మద్దతు ధర అందించాలి. ఒకవేళ అన్ని రాష్ట్రాలకూ ఈ పద్ధతి అనువుగా ఉండదనుకుంటే... ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నష్టపరిహారాన్నైనా అందించాలి.వాయు కాలుష్యంలో శిలాజ ఇంధనాల వాటా దాదాపు 20 శాతం. చౌక ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగం (ప్యాకేజింగ్, ఒకసారి వాడి పారేయడం) వల్ల జల వనరులకు తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వాడి పారేసే ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై సుంకాలు విధించాలి. విద్యుత్తుతో, హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్స్‌తో నడిచే వ్యక్తిగత, రవాణా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటిపై పన్నులు ఎత్తివేయడం, వాడుతున్నందుకు ప్రోత్సాహకాలు అందించడం చేయాలి. గంగా పరీవాహక ప్రాంతాన్ని మినహా మిగిలిన చోట్ల బొగ్గు, ఇనుము, అల్యూమినియం, రాగి,జింక్, నికెల్ వంటి ఖనిజ నిక్షేపాలు బోలెడున్నాయి. ఈ ప్రకృతి వనరులపై సహజంగానే ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖనిజాన్వేషణ, వెలికితీత హక్కులు, ఆదాయం కూడా ఆయా రాష్ట్రాలకే చెందాలి.ఆర్మీలో కొన్ని ప్రాంతాలకేనా అవకాశం?సాయుధ దళాలు, పారామిలిటరీ దళాల్లో నియామకాలు కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలోనే అతి పురాతనమైన పదాతిదళ రెజిమెంట్... మద్రాస్ రెజిమెంట్. నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. దీంట్లో మొత్తం 29 బెటా లియన్లు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం అంటే సుమారు 27 కోట్లు లేదా దేశ జనాభాలో 22 శాతం మంది దీని పరిధిలోకి వస్తారు. మరోవైపు సిఖ్ రెజిమెంట్‌కు నియామకాలు 80 లక్షల జనాభానుంచి జరుగుతూంటాయి. ఈ రెజిమెంట్‌లో 24 పదాతిదళ బెటాలి యన్లున్నాయి. పంజాబ్ కేంద్రంగా ఉండే అన్ని రెజిమెంట్స్‌ను కలుపు కొంటే మొత్తం 74 బెటాలియన్లు ఉన్నాయి. మూడు కోట్ల మందినుంచి ఈ నియామకాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం ఏర్పాటైన వ్యవస్థలో ఈ రకమైన ప్రాతినిధ్యం ఎంత వరకూ సబబు? గ్రామీణ ప్రాంత యువతకు మేలైన ఉద్యోగావకాశం కల్పించే మిలిటరీలో అన్ని ప్రాంతాలకూ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. పెట్టుబడులు ఎక్కువ అవసరమయ్యే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ కేంద్రం నియంత్రణలోనే ఉండటంతో పాటు ఈ రంగంలోకి అడుగుపెట్టడం పెద్ద వ్యాపారవేత్తలకే సాధ్యమయ్యే పరిస్థితి. జనాభాలో ఎక్కువమందికి చేరువ కాగల అవకాశమున్న రేడియోపై కూడా పెత్తనం కేంద్రానిదే. ఇలా కాకుండా ఎఫ్‌ఎంబ్యాండ్లపై రేడియో ఛానళ్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని స్థానికులకు కల్పించాలి. ప్రైవేట్, ప్రభుత్వ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు పని చేస్తున్నప్పుడు... సమాచారం కోసం అత్యధికులు ఆధారపడే రేడియో ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ వనరులతో ఎందుకు నడవకూడదు? భారతదేశ ఏకత్వం అందరికీ సముచిత గౌరవమన్న దానిపై ఆధారపడి ఉండాలి. రాజకీయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రాల న్నిటినీ భారత రాజ్యాంగం ఒక్కటిగా ఉంచుతోంది. అందరూ తమ గొంతు వినిపించేందుకు అవకాశం లభిస్తోంది. ఒక కేంద్రీకృత వ్యవస్థగా, ఏకస్వామ్యంగా మార్చేందుకు చేసే ఏ ప్రయత్నమైనా... అసలు ఉద్దేశాన్ని, సమాఖ్యను ముక్కలు చేస్తుంది.» కొన్ని రాష్ట్రాల శక్తిని తగ్గించేదిగా ఉన్న పునర్విభజన ప్రకియను నిలిపివేయాలి. ప్రస్తుత పార్లమెంటరీ నియోజక వర్గాలను మార్చడంపై శాశ్వత నిషేధం విధించాలి.» ప్రస్తుతం రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో 42 శాతం మాత్రమే లభిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. వాటా క్రమేపీ 66 శాతానికి చేరాలి.» విద్య మొత్తాన్ని రాష్ట్రాల జాబితాలోకి చేర్చడం మంచిది. రాష్ట్రాలపై ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల పెత్తనానికి ఫుల్స్టాప్ పడాలి.- వ్యాసకర్త ఫ్రీలాన్స్ కామెంటేటర్, రచయితmohanguru@gmail.com-మోహన్ గురుస్వామి -
15, 16 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్ : దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. ‘భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్’ అంశంపై ఈనెల 15, 16 తేదీ ల్లో హైదరాబాద్‌లో మొదటి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం ది. మ్యూజియంలు ఆడియో–విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించి, డాక్యుమెంట్ రూపంలో భద్రపరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉంటాయని వివరించింది. సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపింది. -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
మమ్మల్నిలా ఒగ్గేయకండి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ వచ్చాక కళలు వర్థిల్లుతున్నాయి. ఇది నూటికి నూరుపాళ్లూ కళల రాజ్యం... కళాకారుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం... కళాకారులు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఇవీ ప్రభుత్వపెద్దలు తరచూ చెప్పే మాటలు. కానీ, అటువంటి చోట కళాకారులు ఆందోళనకు దిగటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఒగ్గు, జానపద కళాకారులు శుక్రవారం ధర్నా చేశారు. పూట గడవక అల్లాడుతున్నానని ప్రభుత్వ పురస్కార గ్రహీత 12 మెట్ల కిన్నెర మొగిలయ్య ఇటీవల మీడియా ఎదుట గోడువెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయా జిల్లాల నుంచి ఒగ్గు, జానపద కళాకారులు తరలివచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం వినతిప్రతం అందజేసేందుకు ఒగ్గు కళాకారుల సంఘం ప్రతినిధి బృందం భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోకి వెళ్లింది. ‘బయటనే మాట్లాడుకొందాం పదా’అని ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ధర్నా వద్దకు వచ్చి అందర్నీ సముదాయించారు. రవీంద్రభారతి సమావేశమందిరంలోకి తీసుకెళ్లి సమస్యలను చర్చించారు. నెల రోజుల్లో పరిష్కారం కళాకారులు కోరినట్లుగా సెప్టెంబర్ 15న ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ గుర్తింపు కార్డులు అక్కడికక్కడే అందజేస్తామని భాషా, సాంస్కృతిక శాఖ ౖడైరెక్టర్ హరికృష్ణ అన్నారు.. కళాకారులకు శిక్షణ కోసం ఒగ్గుకథ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. పింఛన్లు లిస్టు ప్రకారం అర్హులకు అందజేస్తూ వస్తామని హామీనిచ్చారు. ఒగ్గు కళాకారుల సామగ్రి, ఇన్సూరెన్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన హామీనిచ్చారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ప్రమాదవశాత్తు మరణించిన కళాకారులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఒగ్గు కళాకారులకు ఒగ్గు కథ సామగ్రి, డోళ్లు, గజ్జెలు, నపీర, తాళాలు, దుస్తులు ఉచితంగా ఇవ్వాలి. – బెల్లం పరమేష్, ఒగ్గు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి.. ప్రతి జిల్లాలో ఒగ్గు, జానపద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. పింఛన్ల సంఖ్యను పెంచి అర్హులైన వారందరికీ తక్షణమే మంజూరు చేయాలి. కళాకారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. – చేవాళ్ల శంకరయ్య, ఒగ్గు కళాకారుడు సీఎం రానిస్తలేడు... అందరు పోరాడితే తెలంగాణ వచ్చింది. మన రాజ్యమే అనుకున్నాం. ఏమి లాభం.. ఏడాది కిందట ఆన్లైన్ పద్ధతిన కళాకారులకు గుర్తింపు కార్డులిస్తమన్నరు. ఒక్కరికి కూడా కార్డు రాలేదు. సాంస్కృతిక సారథిలో మాలో ఒక్కరికి కూడా ఉద్యో గం రాలేదు. సీఎం కేసీఆర్‌కు బాధల్ని చెప్పుకొందామంటే రానిస్తలేడు. క్యాంప్ ఏర్పాటు చేసి ఒగ్గు కళాకారులకు గుర్తింపుకార్డులు అక్కడికక్కడే ఇవ్వాలి. ‘సారథి’లో రిజర్వేషన్లు అమలు చేయాలి. – కె. సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, ఒగ్గు, జానపద కళాకారుల సంఘం. పింఛన్ ఇయ్యం పో అంటున్నరు జనగాం డీపీఆర్వో కార్యాలయానికి పింఛన్ కోసం వెళ్లితే ‘నీకు రాదు, ఇయ్యం పో’ అంటున్నారు. 50 ఏళ్లు దాటిన ఒగ్గు కళాకారులందరికీ నెలకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలి. పథకాల ప్రచార కార్యక్రమాల్లో మాకు కూడా అవకాశం కల్పించాలి. –సీహెచ్ అంజయ్య, డోళ్ల విన్యాసం కళాకారుడు -
పరిశోధనలతో పర్యాటకానికి కొత్తశోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చారిత్రక, పురావస్తు అంశాలపై జరిగే పరిశోధనలు పర్యాటక రంగానికి కొత్తశోభను తెస్తున్నాయని పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. పరిశోధకులు గుర్తించిన అంశాలను వెలుగులోకి తేవటం ద్వారా పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ పురావస్తు సదస్సును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. సదస్సుల్లో సమర్పించే పరిశోధనాపత్రాల వల్ల తెలంగాణలోని చారిత్రక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని వారసత్వ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొత్త చట్టాన్ని కూడా తెచ్చిందని ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన మొదటి అంతర్జాతీయ సదస్సుకు మంచి స్పందన రావటంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందులో 450 పరిశోధనా పత్రాలు దాఖలు కాగా, సమయాభావం వల్ల కొన్నింటినే ఎంపిక చేశామన్నారు. మూడో సదస్సును మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో చరిత్రకు వక్రభాష్యం చెప్పారని, తెలంగాణలో లభించిన నాణేల వల్ల ఈ ప్రాంతం ప్రత్యేకత జనబాహుళ్యంలోకి వెళ్లిందని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ చారిత్రక, పురావస్తు ప్రాధాన్య ప్రాంతాలకు నెలవని ప్రభుత్వ సలహాదారు పాపారావు అన్నారు. కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశాలాచ్చి, అధికారులు రంగాచార్యులు, రాములునాయక్, నాగరాజు, పద్మనాభ, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మూడు సెషన్లలో 16 మంది పరిశోధనాపత్రాలను సమర్పించారు. -
‘తిలక్’ నిధులు మింగేశారు!
న్యూఢిల్లీ: బాల గంగాధర్ తిలక్‌పై సినిమా రూపొందించేందుకంటూ తీసుకున్న రూ. 2.5 కోట్ల నిధులను మింగేశారు. సినిమా కోసం 2005లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా వీఆర్ కమలా పుర్కర్ అనే వ్యక్తి సాంస్కృతిక శాఖకు దరఖాస్తు చేశారు. నిర్మాత వినయ్ ధుమాలేకు రూ.2.5 కోట్లు ఇచ్చామని, అయితే ఆయన సినిమాను రూపొందించలేదని ఆ శాఖ.. .సమాచార కమిషన్‌కు తెలిపింది. రికార్డులేవీ తమ వద్ద లేవని చెప్పింది. ‘ధుమాలేకి రెండు విడతల్లో మొత్తం డబ్బు బదిలీ చేశారు. కానీ అతడు సినిమా రూపొందించలేదు’ అని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై విచారణ జరపాలని, 60 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు. -
అంబరాన్నంటేలా సంబురాలు
తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి చందూలాల్ ♦ అన్నిచోట్లా పతాక ఆవిష్కరణలు.. ♦ ప్రముఖులకు సన్మానాలు సాక్షి, హైదరాబాద్: అంబరాన్ని అంటేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర అవతరణ పండుగలో భాగస్వాములను చేసేలా సాంస్కృతిక శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలందరూ పండుగ చేసుకునేలా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక శాఖపరంగా చేపట్టిన ఉత్సవ ఏర్పాట్లను మంత్రి వివరించారు. వివిధ రంగాల్లోని 62 మంది ప్రముఖులను రాష్ట్రస్థాయిలో, 25 మందిని జిల్లా స్థాయిలో ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రపంచానికి చాటేలా ప్రజలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా అన్ని ప్రాంతాల్లో పతాక ఆవిష్కరణలు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా లుంబినీ పార్కులో అమరవీరుల స్మృతివనం, సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నగరంలో ఖవ్వాలీ, గజల్, ముషాయిరా.. తదితర సంప్రదాయ క ళలతోపాటు కల్చరల్ కార్నివాల్, కవి సమ్మేళనాలు, పేరిణి నృత్యాలు నిర్వహిస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా జరుపుకుంటున్న ఉత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు. సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వారధి తరపున ప్రతి జిల్లాకు సంబంధించిన సంస్కృతిని, సంప్రదాయాన్ని ఆవిష్కరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఉత్సవాల్లో ఫైర్‌వాల్, కల్చరల్ కార్నివాల్, కొరేకల్స్ రేసింగ్, లైట్పార్క్, ఫుడ్ ఫెస్టివల్స్ వంటివి ఏర్పాటు చేశామని సాం స్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బాగా అలంకరించిన నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా.. లలిత కళా తోరణంలో ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు డప్పులు, డోళ్లు, పేర్ని మహానృత్యం నిర్వహిస్తారు. పీపుల్స్ ప్లాజాలో వివిధ జిల్లాల కళాకారులతో గోండు, కోయ, లంబాడా.. తదితర నృత్య ప్రదర్శనలు, రవీంద్రభారతిలో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నృత్యరూపకం, బాలల నాటిక ‘దీనబాంధవ’, తెలుగు యూనివర్సిటీలో కవి సమ్మేళనం, హరిహర కళాభవన్‌లో బుద్ధిస్ట్, జైన్, క్రిస్టియన్ కార్యక్రమాలు, కిల్వత్ మైదానంలో ఖవ్వాలీ, ఎల్బీ స్టేడియంలో గజల్స్, కులీ కుతుబ్‌షా స్టేడియంలో ముషాయిరా, ఎల్బీనగర్ జగజ్జీవన్‌రామ్ హాల్లో ఫోక్, కల్చరల్ ఈవెంట్స్, హెచ్ఐసీసీలో సాం స్కృతిక కార్యక్రమాలు, ట్యాంక్‌బండ్‌పై, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ, బోనాలు, కోలాటం తదితర ప్రదర్శనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజాం వారసులకు ఆహ్వానం.. అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ నిజాం వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా కింగ్‌కోఠిలో నివసిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుడు, మునిమనవడు మీర్జా మొహిబ్ బేగ్‌కు సచివాలయం నుంచి ఆహ్వానం అందింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో మీర్జాకు ఏ1 సిరీస్‌లో సీటు కేటాయించింది. కుటుంబసమేతంగా హాజరవ్వా లంటూ ప్రభుత్వం లేఖ పంపినట్టు మీర్జా తెలిపారు. -
‘రవీంధ్రభారతి’కి ఇక మంచిరోజులు
నిధులు రూ. 30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంపు సాక్షి, హైదరాబాద్ : సాంస్కృతిక వికాస కేంద్రంగా విరాజిల్లుతున్న రవీంద్రభారతికి ఇక అన్నీ మంచిరోజులే అని చెప్పొచ్చు. ఇంతవరకు రవీంద్రభారతి ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించి నిర్వహణ నిధులను రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచారు. వాస్తవంగా రవీంద్రభారతికి వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా నెలకు రూ.3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కానీ జీతభత్యాలే రూ. 9లక్షలు వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్రభారతికున్న ఆర్థిక కష్ట నష్టాల గురించి సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ ఇటీవల సీఎం కేసీఆర్‌కు వివరించారు. స్పందిం చిన ఆయన తగిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీనిపై హరికృష్ణ నివేదిక ఇస్తూ రూ.2 కోట్లు ఇస్తే సరిపోతుందని వివరించారు. కేసీఆర్ వెంటనే సమ్మతం తెలుపుతూ రవీంద్రభారతికి మరమ్మతులు కూడా చేయించాలని ఆదేశించారు. అసెంబ్లీలో ప్రకటించిన బడ్జెట్ సందర్భంగా రవీంద్రభారతి నిధులకు ఆమోద ముద్ర కూడా వేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక జీవో విడుదల కానున్నది. -
14,15 తేదీల్లో పతంగుల పండుగ
తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహణ: చందూలాల్ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘అంతర్జాతీయ పతంగుల పండుగ’ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. శంషాబాద్‌లోని ఆగాఖాన్ అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రాంగణంలో ఆ సంస్థతో కలసి తమ శాఖ ఈ పండుగ నిర్వహిస్తుంద న్నారు. టర్కీ, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, చైనా తదితర 32 దేశాల నుంచి వచ్చే కైట్ ఫ్లయర్స్, గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారన్నారు. శుక్రవారం సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, పర్యాటకశాఖ కార్యదర్శి బి.వెంకటేశం, టూరిజం డెరైక్టర్ సునీత భగవతి, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాకారులకు గుర్తింపు కార్డులు: ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు డిజైన్లు పూర్తయ్యాయని చందూలాల్ చెప్పారు. అలాగే జానపద, గిరిజన, టీవీ, ఉర్దూ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలోని రెండు వేల మంది వృద్ధ కళాకారులకు తోడు మరో 1,200 మందికి మార్చి/ఏప్రిల్‌లలో పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సూరజ్‌కుండ్ మేళా థీమ్స్టేట్గా తెలంగాణ: ప్రసిద్ధి పొందిన హరియాణాలోని సూరజ్‌కుండ్ మేళాలో థీమ్ స్టేట్‌గా తెలంగాణ ఉండబోతోందని పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం తెలిపారు. ఈ మేళాలో కాకతీయ తోరణం గానీ, యాదాద్రి గానీ, లేదంటే ఈ రెండింటి నమూనాలను శాశ్వత కట్టడంగా అక్కడ నిర్మించబోతున్నామన్నారు. జనవరిలో హెలికాప్టర్ జాయ్‌రైడ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్‌ను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. -
వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
జూన్ 1 నుంచి 7 వరకు ఉత్సవాలు వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు మార్గదర్శకాలు జారీ చేసిన సాంస్కృతిక శాఖ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరపాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో వివిధ రంగాల్లో విశేష కృషి, అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రముఖులను అవార్డులతో సత్కరించాలని అధికారులకు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం జిల్లా కలెక్టర్లకు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీన రాత్రి స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలతో పాటు రాష్ట్ర అవతరణ సూచికగా అర్ధరాత్రి బాణసంచా పేలుస్తారు. 2వ తేదీన జిల్లా కేంద్రాల్లో అమర వీరుల స్మారక స్థూపాల వద్ద నివాళులు అర్పించటంతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసు, ఎన్సీసీ పరేడ్ నిర్వహించి వివిధ రంగాల్లో ప్రముఖులను అవార్డులతో సత్కరిస్తారు. వారం రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగలా ఉత్సవాలు జరుపుతారు. అన్ని ప్రభుత్వ భవనాలకు విద్యుత్ దీపాలంకరణ చేస్తారు. స్థానిక కవులు, కళాకారులతో సాహిత్య కార్యక్రమాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, ఫొటో ప్రదర్శనలు, తెలంగాణ నేపథ్యంతో వచ్చిన సినిమాల ప్రదర్శన.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, చరి త్ర వారసత్వం, అభివృద్ధిపై విశ్వవిద్యాలయాల సమన్వయంతో సెమినార్లు, వర్క్‌షాపులు, తెలంగాణ రుచులు, హస్తకళా శిబిరాలు, హెరిటేజ్ వాక్, ప్రత్యేక రన్, శాస్త్రీయ జానపద కళారూపాలు, సంగీత నృత్య రూపకాల ప్రదర్శనలు, ఖవ్వాలీ, గజల్స్‌ను నిర్వహిస్తారు. ముగింపు వేడుకల్లో శోభాయాత్ర జూన్ 7న ముగింపు వేడుకల్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధుల సారథ్యంలో ఊరేగింపులు, శోభాయాత్ర నిర్వహిస్తారు. సౌండ్ అండ్ లైట్ షో నిర్వహించి బాణసంచా పేలుస్తారు. రాష్ట్ర రాజధానిలో జరిగే భారీ ముగింపు వేడుకలకు ప్రతి జిల్లా నుంచి 500 మంది కళాకారులను రప్పిస్తారు. ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జెడ్పీ చైర్మన్ ఉపాధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా ఉండే కమిటీ జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలో అవార్డులను ఎంపిక చేస్తుంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు ఈ కమిటీలో కో ఆప్టెడ్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో పది మంది, మున్సిపాలిటీల్లో 15 మంది, కార్పొరేషన్ పరిధిలో 20 మంది ప్రముఖులకు రూ.10,116 చొప్పున నగదును పారితోషికంగా అందిస్తారు. జిల్లా స్థాయిలో 30 మంది ప్రముఖులకు రూ.51,116 చొప్పున అందిస్తారు. ఉత్తమ రైతు, ఉపాధ్యాయుడు, అర్చకుడు, అంగన్వాడీ కార్యకర్త, సామాజిక సేవకుడు, ప్రభుత్వ ఉద్యోగి, వైద్యుడు, జర్నలిస్టు, న్యాయవాది, ఎన్జీవో, క్రీడాకారుడు, సాహితీవేత్త, కళాకారు లు తదితర కేటగిరీల్లో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవార్డులుంటాయి. -
సాంస్కృతిక శాఖపై దండెత్తిన ఒగ్గు కళాకారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయంపైకి ఒగ్గు కళాకారులు దండెత్తారు. దీంతో సోమవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒగ్గు కథ కళాకారులకు అక్టోబర్ 7, 8 తేదీల్లో వర్క్‌షాపును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు రవీంద్రభారతికి వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 5వ తేదీన వర్క్‌షాపు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించారు. అప్పటికే రవాణాకి కొంత మొత్తం వెచ్చించిన 132 మంది కళాకారులు సోమవారం ఉదయం 11.30కి రవీంద్రభారతికి చేరుకున్నారు. ఒగ్గు కథ, గొరవయ్యలు, తప్పెటగుళ్ళు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సత్యనారాయణ, నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు కార్యాలయం ఎదుట బ్యాండ్, డోల్, నపీరాలు వాయిస్తూ ధర్నాకు దిగి గంటపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఆర్.కవితాప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ చివరిలో ఒగ్గు కళాకారుల వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు.