కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
Published Sat, Feb 11 2017 10:52 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ముంబైలోని టాటా మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. పరెల్ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్పత్రిలో మూడోస్థాయి అగ్నిప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని బేస్‌మెంటులో మంటలు చెలరేగాయి. దాంతో నాలుగు ఫైరింజన్లను, నాలుగు వాటర్ ట్యాంకర్లను కూడా అక్కడకు తరలించి, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదయం 9 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, దాంతో వెంటనే అక్కడకు వెళ్లి సహాయ కార్యకలాపాలు ప్రారంభించామని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు చెప్పారు. మంటలు ఆర్పేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోపు లోపలున్న పేషెంట్లు, వారి బంధువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Advertisement
Advertisement