రుతుపవనాలను కకావికలం చేసి చాలాదేశాల్లో కరవుకు ఎల్‌నినో కారణమవుతోంది. మరి దీనికి ఆజ్యం పోస్తున్నదెవరు..? ఇండొనేసియాలో ఉన్న పామాయిల్ తోటల మంటలే ఇందుకు కారణమా..? అవుననే అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. ఎక్కడో దక్షిణ అమెరికాలోని భూమధ్య రేఖకు సమీపంలో సముద్రపు నీరు వెచ్చబడితే దాని ప్రభావం వల్ల మేఘాలు ఏర్పడటంపై పడుతుందని తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి భారత్ వరకు వర్షపాతాన్ని తగ్గిస్తుందనీ తెలిసిన విషయమే.
దీన్నే ఎల్‌నినో అని పిలుస్తున్నారు. అయితే అయితే ఇండొనేసియాలోని పామాయిల్ తోటల్లోని చెత్తను అక్కడి రైతులు తగలేయడం ఎల్‌నినో ప్రభావాన్ని మరింత తీవ్రం చేస్తోందని నాసా చెబుతోంది. ఈ మంటల ద్వారా వెలువడే పొగ ఆఫ్రికా ఖండం దాటి వెళుతోందని ఉపగ్రహాల ద్వారా నాసా గుర్తించింది. గతేడాది ఎల్‌నినో సందర్భంగా ఇండొనేసియా నుంచి దాదాపు 150 కోట్ల టన్నుల కాలుష్య కారకాలు పొగ రూపంలో వెలువడ్డాయని వివరించింది. 1997-2015 మధ్యకాలంలో ఎల్‌నినో వచ్చిన సమయాల్లో ఈ మంటలు ఎక్కువగా ఉన్నపుడు కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్లు నాసా పేర్కొంది.
ఎల్‌నినోకు ఆ మంటలు కారణమా!
Published Wed, Aug 3 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
Advertisement